రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన క్లాసెన్‌ | IPL 2026 SRH Vs PBKS, Heinrich Klaasen Scripts History Most 50 Plus Scores For SRH In IPL, Check Out Highlights And Viral Video Inside | Sakshi
Sakshi News home page

రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన క్లాసెన్‌

May 6 2026 9:56 PM | Updated on May 7 2026 1:00 PM

Heinrich Klaasen Scripts History Most 50-Plus Scores for SRH In IPL

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ ప‌లు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 ప‌రుగులు సాధించిన క్లాసెన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు బాదిన క్రికెటర్ల జాబితాలో క్లాసెన్ చోటు సంపాదించాడు.

ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున క్లాసెస్‌కు ఇది 14వ అర్థ‌శ‌త‌కం కాగా.. అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. 18 హాఫ్ సెంచ‌రీల‌తో కేన్ విలియ‌మ్స‌న్ మూడో స్థానంలో, 19 అర్థ‌శ‌త‌కాల‌తో శిఖ‌ర్ దావ‌న్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మొద‌టి స్థానంలో డేవిడ్ వార్న‌ర్ 42 అర్థ‌శ‌త‌కాల‌తో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిలిచాడు.

అంతేకాదు క్లాసెన్ ఈ మ్యాచ్ ద్వారా మ‌రో రికార్డు కూడా సాధించాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి దాకా 5 హాఫ్ సెంచ‌రీలు బాది తొలి స్థానంలో నిలిచాడు. అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, కేఎల్ రాహుల్‌, సాయి సుద‌ర్శ‌న్‌, ప్ర‌బ్‌సిమ్ర‌న్‌, అయ్య‌ర్‌లు నాలుగు హాఫ్ సెంచ‌రీలు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.

ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిష‌న్ (55) అర్థ‌సెంచ‌రీతో రాణించారు. అంత‌క‌ముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, చాహ‌ల్‌, ఫెర్గూస‌న్‌, విజ‌య్‌కుమార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.

 చదవండి: పంజాబ్ అంటేనే అభిషేక్‌కు పూన‌కం!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement