డివిలియ‌ర్స్ విధ్వంసం.. విండీస్‌పై సౌతాఫ్రికా భారీ స్కోరు | AB De Villiers-70 Runs-Massive Knock-Vs West Indies Champions-WCL 2026 | Sakshi
Sakshi News home page

డివిలియ‌ర్స్ విధ్వంసం.. విండీస్‌పై సౌతాఫ్రికా భారీ స్కోరు

Oct 4 2026 7:34 PM | Updated on Oct 4 2026 7:55 PM

AB De Villiers-70 Runs-Massive Knock-Vs West Indies Champions-WCL 2026

Photo Credit: Twitter

వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డ‌బ్ల్యూసీఎల్‌) 2026 టోర్నీలో భాగంగా వెస్టిండీస్ చాంపియ‌న్స్‌తో జ‌రుగుతున్న టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా చాంపియ‌న్స్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఏబీ డివిలియ‌ర్స్ (39 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), ఓపెన‌ర్ రిచ‌ర్డ్ లెవీ (39 బంతుల్లో 87; 5 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) భారీ అర్థ‌శ‌త‌కాల‌తో విధ్వంసం సృష్టించారు. 

వీరిద్ద‌రి బీభ‌త్సం ధాటికి సౌతాఫ్రికా చాంపియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 242 ప‌రుగులు చేసింది. చివ‌ర్లో సారెల్ ఎర్వీ (23) ధాటిగా ఆడాడు. వెస్టిండీస్ చాంపియ‌న్స్ బౌల‌ర్ల‌లో డేవ్ మొహ‌మ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా, ఫిడెల్ ఎడ్‌వ‌ర్డ్స్‌, రెయాడ్ ఎమ్రిట్‌, డ్వేన్ బ్రావో త‌లా ఒక వికెట్ తీశారు. ముందుగా రిచ‌ర్డ్ లెవీ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 

ఫోర్లు, సిక్స‌ర్ల‌తో మైదానం హోరెత్తించాడు. అగ్నికి వాయువు తోడైన‌ట్లు లెవీకి డివిలియ‌ర్స్ జ‌త క‌ల‌వ‌డంతో స్కోరుబోర్డు ఉర‌క‌లెత్తింది. ఈ ఇద్ద‌రు రెండో వికెట్‌కు 42 బంతుల్లోనే 104 ప‌రుగులు సాధించి సౌతాఫ్రికా భారీ స్కోరుకు బాట‌లు వేశారు. లెవీ ఔటైన‌ప్ప‌టికీ, సారెల్ ఎర్వీతో క‌లిసి డివిలియ‌ర్స్ జ‌ట్టు స్కోరును 200 దాటించాడు.

ఇదీ చదవండి: 'రోహిత్ న‌న్ను పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement