Photo Credit: BCCI Twitter
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ముగిసిన తొలి టెస్టు డ్రా అయినప్పటికీ టీమిండియా మాత్రం ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఒక టెస్టు మ్యాచ్‌లో ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ బౌలర్లను ఉపయోగించడం టీమిండియాకు ఇది 28వ సారి.
కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎనిమిది మందితో బౌలింగ్ చేయించాడు. ఇందులో రెగ్యులర్ బౌలర్స్ అయిన బుమ్రా (20 ఓవర్లు) , ఆకాశ్ దీప్ (20 ఓవర్లు), అన్షుల్ కాంబోజ్ (22 ఓవర్లు), ప్రసిధ్ క్రిష్ణ (19 ఓవర్లు), వాషింగ్టన్ సుందర్ (35 ఓవర్లు) బౌలింగ్ వేశారు. వీరికి అదనంగా పడిక్కల్ (ఒక ఓవర్), జైస్వాల్ (రెండు ఓవర్లు), ధ్రువ్ జురెల్ (ఒక ఓవర్) తమ వంతుగా బంతులు విసిరారు.
గతంలో రెండు సందర్భాల్లో..
ఇక చివరగా ఈ ఏడాది ఆగస్టులో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో భారత్ తరఫున ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మందితో బౌలింగ్ చేయడం జరిగింది. రెండు వరుస టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఎమినిది మంది భారత బౌలర్లు బౌలింగ్ వేసిన దాఖలాలు గతంలో రెండు సందర్భాల్లో మాత్రమే జరిగింది.
1952 డిసెంబర్‌లో కోల్‌కతా వేదికగా పాకిస్తాన్‌తో టెస్టులో, ఆ తర్వాత వెంటనే 1953 జనవరిలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది భారత బౌలర్లు బంతులు విసిరారు. ఆ తర్వాత 1963/64లో ఇంగ్లండ్‌తో హోమ్ సిరీస్‌లోనూ రెండు వరుస టెస్టుల్లో ఇలాగే భారత్ నుంచి ఎనిమిది మంది బౌలింగ్ వేయడం విశేషం.
42 మెయిడెన్ ఓవర్లు
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 42 మెయిడెన్ ఓవర్లు వేసింది. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో ఒక జట్టు ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధికం. భారత్ చివరిసారిగా ఒక జట్టు ఇన్నింగ్స్‌లో 40 లేదా అంతకంటే ఎక్కువగా మెయిడెన్ ఓవర్లు వేసింది ఒకసారి మాత్రమే. 2015లో ఢిల్లీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఒక ఇన్నింగ్స్‌లో 89 మెయిడెన్లు వేయడం విశేషం.
కివీస్‌కు ఇది రెండోసారి
భారత్‌తో టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 43 వరుస ఓవర్ల పాటు సుదీర్ఘ బ్యాటింగ్ చేయడం న్యూజిలాండ్‌కు ఇది రెండోసారి. 2014లో భారత్‌తో జరిగిన టెస్టులో బ్రెండన్ మెక్‌కల్లమ్, బీజే వాట్లింగ్ 123 ఓవర్లలో 352 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం తొలిసారి కాగా, ఇప్పటికీ ఇది ఆల్ టైమ్ రికార్డుగా ఉండడం విశేషం.
ఇదీ చదవండి: NZ Vs IND: వెల్లింగ్టన్‌లో ఇది రెండోసారి మాత్రమే!


