‘గెలుస్తామనుకున్నాం.. ఇలా జరుగుతుందని ఊహించలేదు’ | Shubman Gill-Says-Tough-To-Get-10 Wkts-This Pitch-After 1st Test Drawn | Sakshi
Sakshi News home page

‘గెలుస్తామనుకున్నాం.. ఇలా జరుగుతుందని ఊహించలేదు’

Nov 23 2026 11:12 AM | Updated on Nov 23 2026 11:24 AM

Shubman Gill-Says-Tough-To-Get-10 Wkts-This Pitch-After 1st Test Drawn

Photo Credit: Twitter

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌, భారత్ మధ్య జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే. భారత్ విజయానికి ఐదు వికెట్లు అవసరమైనప్పటికీ, డారిల్ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్‌లు కలిసి ఏకధాటిగా 312 బంతులెదుర్కొని కివీస్‌ను ఓటమి నుంచి తప్పించి హీరోలుగా నిలిచారు. ఫలితం రాదని తేలిపోవడంతో మరో 15 ఓవర్లు మిగిలి ఉండగానే ఇరుజట్లు డ్రాకు అంగీకరించాయి. మ్యాచ్ డ్రా అనంతరం భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడాడు. 

మ్యాచ్ గెలుస్తామని భావించానని, ​కానీ డారిల్ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్ అడ్డుగోడలా నిలబడి తమకు విజయాన్ని దూరం చేశారని గిల్ పేర్కొన్నాడు. గిల్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ వికెట్‌పై పది వికెట్లు తీయడం సవాల్‌తో కూడుకున్నదని మాకు ముందే తెలుసు. అయితే కివీస్‌ను ఆలౌట్ చేయడానికి మాకు అవకాశాలు లభించాయి. 

ప్రత్యర్థికి సవాల్‌ విసిరాం..
కానీ మిచెల్‌, ఫిలిప్స్‌లు అద్భుతంగా పోరాడి మాకు విజయం దక్కకుండా అడ్డుకున్నారు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఇక ఫీల్డింగ్‌లో మేము బాగానే రాణించామని అనుకుంటున్నాను. విదేశీ గడ్డపై మేము ఇంత బాగా బ్యాటింగ్ చేయడం సానుకూలాంశం. ఎందుకంటే స్వదేశంలో మాకు కొట్టిని పిండి లాంటి పిచ్‌లపై ఇలా బ్యాటింగ్ చేయడం సర్వసాధారణం. కానీ కివీస్ లాంటి బౌన్సీ పిచ్‌లపై మా బ్యాటర్లంతా భారీ ఇన్నింగ్స్‌లు ఆడడం ద్వారా ప్రత్యర్థికి గట్టి సవాల్ విసిరామని భావిస్తున్నా. 

మా బ్యాటింగ్‌లో రెండు శతకాలే వచ్చినప్పటికీ, 700 ప్లస్ స్కోరు సాధించడం సంతోషంగా ఉంది. రెండో టెస్టుకు ప్రత్యేకంగా ప్రణాళికలంటూ ఏమీ లేవు. మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు కూడా పెద్దగా కనబడడం లేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో మా ప్లేయర్లు సత్తా చాటారు. అయితే క్రైస్ట్‌చర్చిలో పిచ్ బౌలర్లకు కొంతమేర సహకరిస్తుందని ఆశిస్తున్నా. కాబట్టి రెండో టెస్టులోనూ ఇదే తరహా ఆటతో విజయం సాధించాలని కోరకుంటున్నా. 

మా బౌలర్లు అలసిపోయారు..
15 ఓవర్లు మిగిలి ఉండగానే డ్రాకు అంగీకరించడం వెనుక కారణాలు ఏం లేవు. వెల్లింగ్టన్ పిచ్ నుంచి బౌలర్లకు సహకారం అందడం లేదు. అందునా మా ఫాస్ట్ బౌలర్లు బంతులేసి బాగా అలసిపోయారు. ఆ 15 ఓవర్లు వేసినా ఐదు వికెట్లు తీస్తామన్న గ్యారంటీ లేదు. ఇక మూడు రోజుల తర్వాత రెండో టెస్టు ఉండడంతో ఒక్కరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకొని తిరిగి ప్రాక్టీస్ మొదలుపెడుతాం.’ అని చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: NZ Vs IND: భారత్‌కు దక్కని విజయం.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement