PC: BCCI/X
బేసిన్ రిజర్వ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఘోరంగా విఫలమయ్యాడు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ధాటికి రెండు ఇన్నింగ్స్‌లలోనూ పరుగుల ఖాతా తెరవకుండానే లాథమ్ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో లాథమ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌటైన మూడో కివీస్ కెప్టెన్‌గా లాథమ్ నిలిచాడు. గతంలో హ్యారీ కేవ్ (వెస్టిండీస్‌పై, డునెడిన్, 1956), స్టీఫెన్ ఫ్లెమింగ్ (ఆస్ట్రేలియాపై, హోబర్ట్, 1997) మాత్రమే ఈ అవాంఛిత రికార్డును నెలకొల్పారు.
సెహ్వాగ్‌ను దాటేసిన లాథమ్
అదేవిధంగా టెస్టుల్లో అత్యధిక సార్లు డకౌటైన నాలుగో ఓపెనర్‌గా లాథమ్ నిలిచాడు. టెస్టు కెరీర్‌లో ఇది లాథమ్‌కు 16వ డకౌట్. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సెహ్వాగ్ చెత్త రికార్డును లాథమ్ బ్రేక్ చేశాడు.
టెస్టు ఓపెనర్‌గా అత్యధిక డకౌట్లు అయిన ఆటగాళ్లు వీరే
క్రెయిగ్ బ్రాత్‌వైట్-19
మైక్ అథర్టన్-17
మార్వన్ ఆటపట్టు-16
టామ్ లాథమ్-16
వీరేంద్ర సెహ్వాగ్-15
చదవండి: IND vs NZ: టీమిండియా ప్రపంచ రికార్డు


