భారత క్రికెటర్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. శనివారం అతడు భారతీయ జనతా పార్టీలో చేరాడు. పార్టీ ఆయనను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగానియమించింది.అంతకుముందు చాహల్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ అమర్‌పాల్ మౌర్యతో సమావేశమయ్యారు.
పార్టీలో చేరిన అనంతరం చాహల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "బీజేపీ కుటుంబంలో నాకు స్థానం, సముచిత గౌరవం కల్పించిన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యలకు హృదయపూర్వక ధన్యవాదాలు" అని పేర్కొన్నాడు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు ఓబీసీ మోర్చా నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అమర్‌పాల్ మౌర్య తెలిపారు.జాతీయ ఉపాధ్యక్షులు: జోగెన్ మోహన్ (అస్సాం), మమతా మొహంత (ఒడిశా), సంగమ్ లాల్ గుప్తా (ఉత్తరప్రదేశ్), బబన్‌రావ్ రావ్జీ చౌదరి (మహారాష్ట్ర), సత్ ప్రకాష్ రాణా (ఢిల్లీ), అర్జున్ సాహ్ని (బీహార్), సంగీత బల్వంత్ బింద్ (ఉత్తరప్రదేశ్).జాతీయ ప్రధాన కార్యదర్శులు: గజేంద్ర యాదవ్ (ఢిల్లీ), ప్రమోద్ మధ్వరాజ్ (కర్ణాటక), లలిత్ చంద్రకర్ (ఛత్తీస్‌గఢ్).
జాతీయ కార్యదర్శులు: కడగంచి రమేష్ (తెలంగాణ), దశరథ్‌జీ ఠాకూర్ (గుజరాత్), టి. వరదరాజన్ (తమిళనాడు), సంజీవ్ కుమార్ (జార్ఖండ్), సరితా జాంగిడ్ (హర్యానా), వైభవ్ పన్వార్ (మధ్యప్రదేశ్), భీమ్ కుమార్ సాహు (బీహార్). వీరితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 37 మందిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించారు.
కాగా ప్రస్తుతం భారత జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న చాహల్.. ఇటీవల ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రం కొనసాగిస్తానని అతడు స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్.. గతంలో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో కెంట్, నార్తాంప్టన్‌షైర్ జట్ల తరఫున కూడా ఆడాడు.


