న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. టీమిండియా 720 పరుగుల భారీ స్కోర్‌ | India Declare at 720-9 After Dominant Batting Display in Wellington Test | Sakshi
Sakshi News home page

IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. టీమిండియా 720 పరుగుల భారీ స్కోర్‌

Nov 22 2026 7:11 AM | Updated on Nov 22 2026 7:39 AM

India Declare at 720-9 After Dominant Batting Display in Wellington Test

వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త బ్యాట‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. 720/9 పరుగుల భారీ స్కోర్‌ వద్ద టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది.  దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 352 పరుగుల ఆధిక్యం లభించింది. 

భారత ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (136), రిషబ్ పంత్ (128) భారీ సెంచరీలతో కదం తొక్కగా.. యశస్వి జైశ్వాల్‌(85), దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(80), శుబ్‌మన్‌ గిల్‌(98), ధ్రువ్‌ జురెల్‌(78) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. కాగా టెస్టుల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇదే అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు కావడం విశేషం.

ఇంతకముందు 583 అత్యధికగా స్కోర్‌గా ఉండేది. తాజా మ్యాచ్‌తో ఆ స్కోర్‌ను భారత్‌ అధిగమించింది. అలాగే న్యూజిలాండ్‌ గడ్డపై టెస్టుల్లో హైయిస్ట్‌ ఇన్నింగ్స్‌ స్కోర్‌ సాధించిన జట్టుగా భారత్‌ చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌ పేరిట ఉండేది. 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 715 పరుగుల స్కోర్‌ సాధించింది. ఇప్పుడు వెల్లింగ్టన్‌ టెస్టులో 720 పరుగులు చేయడంతో కివీస్‌ ఆల్‌టైమ్‌ రికార్డును భారత్‌ బ్రేక్‌ చేసింది.
చదవండి: రిష‌బ్ పంత్ ప్ర‌పంచ రికార్డు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement