భారత్‌ ‘ఎ’ X పాకిస్తాన్‌ ‘ఎ’ | India A to face Pakistan A today in Asia Cup Rising Stars ODI tournament | Sakshi
Sakshi News home page

భారత్‌ ‘ఎ’ X పాకిస్తాన్‌ ‘ఎ’

Nov 22 2026 4:23 AM | Updated on Nov 22 2026 4:23 AM

India A to face Pakistan A today in Asia Cup Rising Stars ODI tournament

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ వన్డే టోర్నీ 

మ.గం. 3:30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రసారం

దోహా: ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ వన్డే టోర్నమెంట్‌లో ఆదివారం పాకిస్తాన్‌ ‘ఎ’తో భారత ‘ఎ’ జట్టు తలపడనుంది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా శుక్రవారం ఆడిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై 306 పరుగుల తేడాతో జయభేరి మోగించిన తిలక్‌ వర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు... చిరకాల ప్రత్యర్థిపై అదే దూకుడు కొనసాగించాలని భావిస్తోంది. ఇటీవల అండర్‌–19 ఆసియాకప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌పై ఉత్కంఠ పోరులో యువ భారత జట్టు ఘన విజయం సాధించగా... తిలక్‌ కెపె్టన్సీలోని భారత ‘ఎ’ జట్టు కూడా అదే ఆటతీరు కనబర్చాలని అభిమానులు అశిస్తున్నారు. నేపాల్‌తో పోరులో తిలక్, కుమార్‌ కుషాగ్ర సెంచరీలతో కదం తొక్కారు. 

15 ఏళ్ల ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మ, ఆయుశ్‌ బదోనీ, ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్, రింకూ సింగ్, సూర్యాంశ్‌ షెడ్గే కూడా దూకుడుగా ఆడితే భారత్‌కు ఎదురుండదు. బౌలింగ్‌లో ప్రిన్స్‌ యాదవ్, హర్షిత్‌ రాణా కీలకం కానున్నారు. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ పాకిస్తాన్‌ ‘ఎ’ జట్టు తొలి మ్యాచ్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ (యూఏఈ)పై గెలిచి జోరు మీదుంది. అబ్దుల్‌ సమద్‌ సారథ్యంలోని ఆ జట్టులో మాజ్‌ సదఖాత్, మొహమ్మద్‌ హస్నైన్, హసన్‌ నవాజ్, మొహమ్మద్‌ ఇమ్రాన్, షామిల్‌ హుసేన్‌ వంటి పలువురు అంతర్జాతీయ అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement