‘ఒక్క సెంచరీ నీపై ప్రేమను డబుల్ చేసింది’ | KL Rahul-Historic Ton-Vs New Zealand-1st Test-Wife-Athiya-Reaction Viral | Sakshi
Sakshi News home page

‘ఒక్క సెంచరీ నీపై ప్రేమను డబుల్ చేసింది’

Nov 21 2026 8:28 PM | Updated on Nov 21 2026 8:33 PM

KL Rahul-Historic Ton-Vs New Zealand-1st Test-Wife-Athiya-Reaction Viral

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో మెరిశాడు. తన కెరీర్‌లో 13వ టెస్టు శతకం మార్క్ అందుకున్న రాహుల్ SENA దేశాలపై (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) సెంచరీలు సాధించిన తొలి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. 

ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. కేఎల్ రాహుల్ సెంచరీ చేయగానే హెల్మెట్ తీసి డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూస్తోన్న ఫొటోను షేర్ చేసకున్న అతియా శెట్టి లవ్ ఎమోజీ సింబల్‌ను జత చేసింది. ఒక్క సెంచరీతో నీపై ప్రేమ రెట్టింపయ్యింది అనేలా ఒక లవ్ సింబల్‌తో చెప్పకనే చెప్పింది. అతియా శెట్టి పోస్టు పెట్టిన మరుక్షణమే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యాచ్‌లో 290 బంతులెదుర్కొన్న కేఎల్ రాహుల్ 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేశాడు. 207 బంతుల్లో శతకం మార్క్ అందుకున్నాడు. రాహుల్ సెంచరీకి తోడు గిల్ (98) రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ రాణించాడు. వీరిద్దరితో పాటు పడిక్కల్ (80), జైస్వాల్ (85) అర్థసెంచరీలు సాధించారు. 

పంత్ (55 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. దీంతో టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 118 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఇదీ చదవండి: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement