మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా అరంగేట్ర ఆటగాడు లాచ్లాన్ షా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. 23 ఏళ్ల లాచ్లాన్ షా.. తన అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ టామ్ బాంటన్‌ను పెవిలియన్‌కు పంపాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన బెన్ డ్వార్షుయిస్.. ఐదో బంతిని బాంటన్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అప్పటికే 39 పరుగులతో జోరు మీదున్న బాంటన్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌కు తగిలి డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు గాల్లోకి లేచింది.
ఈ సమయంలో స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న లాచ్లాన్ షా.. తన కుడివైపునకు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ అసాధారణ క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, న్యూ సౌత్ వేల్స్ క్రికెటర్ అయిన లాచ్లాన్ షా అనూహ్యంగా ఆస్ట్రేలియా జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. 2024లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన లాచ్లాన్.. ఆస్ట్రేలియా-ఏ, ఆస్ట్రేలియా అండర్-19 జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు తొమ్మిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు ఐదు అర్ధసెంచరీలు సాధించాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించే సత్తా ఉండటంతో, అతడికి జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసే అవకాశం లభించింది.
LACHY SHAW NO WAY! How good from the debutant ✨ #AUSvENG https://t.co/bmNHr9UnQi
— cricket.com.au (@cricketcomau) November 21, 2026


