తొలి మ్యాచ్‌లో ఆ్రస్టేలియా చేతిలో ఎదురైన ఓటమి నుంచి ఇంగ్లండ్ వెంటనే తేరుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 135 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాపై ఘనవిజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 355 పరుగులు చేసింది.
ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ బాంటన్ (121; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. జో రూట్ (62; 5 ఫోర్లు), జోర్డాన్ కాక్స్ (67; 6 ఫోర్లు, 1 సిక్స్), విల్ జాక్స్ (54 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో మెరిపించారు. ఆసీస్ బౌలర్ బార్ట్‌లెట్ మూడు వికెట్లు తీశాడు.
356 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 44.3 ఓవర్లలో 220 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. రెన్ షా (63; 6 ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (64; 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో ఆ్రస్టేలియా స్కోరు 200 దాటింది. ఇంగ్లండ్ బౌలర్లు అట్కిన్‌సన్ (4/28), డాసన్ (2/41), స్యామ్ కరన్ (2/38) ఆసీస్‌ను దెబ్బ కొట్టారు.
చివరిదైన మూడో వన్డే హోబర్ట్‌లో మంగళవారం జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన బాంటన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
బాంటన్ సాధించిన రికార్డులు ఇవే
👉ఆస్ట్రేలియాలో బాంటన్‌కు ఇదే మొట్టమొదటి వన్డే శతకం గమనార్హం.
👉అదేవిధంగా అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో బాంటన్‌కు ఇది రెండో సెంచరీ ఇది.
👉2018 తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సెంచరీ సాధించిన మొదటి ఇంగ్లండ్ ఓపెనర్‌గా బాంటన్ నిలిచాడు.
👉2024 తర్వాత ఆస్ట్రేలియాలో వన్డే శతకం బాదిన మొదటి క్రికెటర్‌గా కూడా అతను రికార్డు సృష్టించాడు.
👉అలాగే అడిలైడ్ ఓవల్ మైదానంలో వన్డేల్లో అత్యదిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇంగ్లీష్ ఓపెనర్‌గా బాంటన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు నిక్ నైట్(88) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో 121 పరుగులు చేసిన బాంటన్.. నైట్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
చదవండి: AUS vs ENG: ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు


