ఐసీసీ ఛైర్మన్‌గా జై షా.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక | ICC CONFIRMS JAY SHAH UNOPPOSED REAPPOINTMENT AS CHAIR FOR SECOND TERM | Sakshi
Sakshi News home page

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక

Nov 16 2026 10:54 AM | Updated on Nov 16 2026 11:04 AM

ICC CONFIRMS JAY SHAH UNOPPOSED REAPPOINTMENT AS CHAIR FOR SECOND TERM

source: X

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఛైర్మన్‌గా జై షా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనను రెండో పర్యాయం కూడా ఏకగ్రీవంగా ఛైర్మన్‌గా నియమించినట్లు ఐసీసీ బోర్డు నవంబర్ 16న ప్రకటించింది. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో డైరెక్టర్లు జై షా పేరును ప్రతిపాదించగా.. ఎలాంటి పోటీ లేకుండానే ఆయనకు మరోసారి అవకాశం దక్కింది.

క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడం, అభిమానుల సంఖ్యను పెంచడం, వాణిజ్యపరంగా ఆటను అభివృద్ధి చేయడం వంటి కీలక లక్ష్యాల నేపథ్యంలో జై షా నాయకత్వంపై ఐసీసీ బోర్డు విశ్వాసం వ్యక్తం చేసింది. ఆయన కొనసాగింపు ద్వారా సంస్థకు నాయకత్వంలో స్థిరత్వం లభిస్తుందని పేర్కొంది.

క్రికెట్ అభివృద్ధికి కట్టుబడి ఉంటా: జై షా
రెండోసారి ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన ఐసీసీ బోర్డుకు, డైరెక్టర్లకు జై షా కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రయోజనాల కోసం సభ్య దేశాలతో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు. క్రికెట్ చరిత్రలో ఇదొక కీలకమైన దశ అని అభిప్రాయపడ్డారు. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం ద్వారా కొత్త ప్రేక్షకులకు ఆటను పరిచయం చేసే గొప్ప అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

జై షా నాయకత్వంపై ప్రశంసలు
జై షా తిరిగి నియమితులవడంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా క్రికెట్ అభివృద్ధికి జై షా నాయకత్వం ఉపయోగపడుతుందని ఐసీసీ స్వతంత్ర డైరెక్టర్ రోస్ రివాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

జింబాబ్వే క్రికెట్ ఛైర్మన్, ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ కూడా షా నాయకత్వాన్ని ప్రశంసించారు. 2027 పురుషుల వన్డే ప్రపంచకప్ ద్వారా ఆఫ్రికాలో క్రికెట్‌కు మరింత ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ రోజర్ ట్వోస్, అసోసియేట్ మెంబర్ ఛైర్మన్ గురుమూర్తి పలాని కూడా జై షాకు అభినందనలు తెలిపారు. 

ఇదీ చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. విరాట్‌ కోహ్లి ఒక్కడే..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement