‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ గా ఎంపికైన భారత ఆల్‌రౌండర్
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళా ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు దక్కింది. గత నెలలో జింబాబ్వేపై దీప్తి ప్రదర్శనకు గానూ ఈ పురస్కారం దక్కింది. 29 ఏళ్ల దీప్తి శర్మకు ఈ అవార్డు లభించడం ఇది రెండోసారి. ‘ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. జింబాబ్వేతో సిరీస్‌లో నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. ముఖ్యంగా సెంచరీ చేయడం చాలా మంచి అనుభూతినిచ్చింది.
యువ ప్లేయర్లతో కూడిన భారత జట్టు జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఈ పురస్కారాన్ని నా అభిమానులకు అంకితమిస్తున్నా’ అని దీప్తి పేర్కొంది. జింబాబ్వేతో మూడు టి20లు, మూడు వన్డేల సిరీస్‌లలో కలిపి దీప్తి 155 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు పడగొట్టింది. ఇక పురుషుల విభాగంలో దక్షిణాఫ్రికా పేస్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ప్రదర్శనకు గాను అతడికి ఈ పురస్కారం దక్కింది.


