టాప్–100లోకి వైష్ణవి శర్మ
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు చేరుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 20 ఏళ్ల వైష్ణవి ఏకంగా 53 స్థానాలు ఎగబాకింది. టాప్–100లోకి దూసుకొచ్చి 94వ ర్యాంక్‌లో నిలిచింది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వైష్ణవి రెండు మ్యాచ్‌లు ఆడింది.
రెండో మ్యాచ్‌లో 39 పరుగులిచ్చి 4 వికెట్లు... మూడో మ్యాచ్‌లో 39 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకుంది. భారత్‌కే చెందిన సయాలీ సత్‌ఘరే 18 స్థానాలు పురోగతి సాధించి 85వ ర్యాంక్‌లో నిలిచింది. భారత్ నుంచి దీప్తి శర్మ అత్యుత్తమంగా 8వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఇక వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కెపె్టన్ స్మృతి మంధాన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా... మాజీ కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఎనిమిదో ర్యాంక్ పదిలంగా ఉంది.


