టీమిండియా స్టార్ ఓపెనర్‌కు ఐసీసీ భారీ షాక్‌! | Shafali Verma Punished By ICC For Breaching Code Of Conduct | Sakshi
Sakshi News home page

టీమిండియా స్టార్ ఓపెనర్‌కు ఐసీసీ భారీ షాక్‌!

Oct 20 2026 3:03 PM | Updated on Oct 20 2026 3:14 PM

Shafali Verma Punished By ICC For Breaching Code Of Conduct

PC: BCCI/X

జింబాబ్వేతో జరగబోయే మూడో టీ20కి ముందు భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ షాకిచ్చింది. రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 'కోడ్ ఆఫ్ కాండక్ట్' ను ఉల్లంఘించినందుకు గాను ఆమెపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

అసలేం జరిగిందంటే?
రెండో మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటింగ్ సమయంలో చిపో ముగెరి-తిరిపానో ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫాలీ డ్రాప్ చేసింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన షఫాలీ కోపంతో బంతిని నేలకేసి విసిరికొట్టింది. ఆటగాళ్ళ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఇది నిబంధనల ఉల్లంఘన క్రిందికి వస్తుంది. ఈ క్రమంలోనే ఐసీసీ షఫాలీని మందలించడంతో పాటు, ఆమె క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.

మంధాన రికార్డ్ బ్రేక్‌
కాగా ఈ మ్యాచ్‌లో షఫాలీ దుమ్ములేపింది. ఈ డాషింగ్‌ ఓపెనర్ కేవలం 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు చేసి ఔటైంది. ఈ ఇన్నింగ్స్‌తో ఓ వరల్డ్ రికార్డును షఫాలీ తన పేరిట లిఖించుకుంది. ఒక​ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా స్మృతి మంధాన(8)ను షఫాలీ(9) అధిగమించింది.
చదవండి: ఏడో స్థానంలో వచ్చి సెంచరీ చేసిన రుతురాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement