ఏడో స్థానంలో వచ్చి సెంచరీ చేసిన రుతురాజ్‌ | HUNDRED FOR RUTURAJ GAIKWAD IN RANJI TROPHY | Sakshi
Sakshi News home page

ఏడో స్థానంలో వచ్చి సెంచరీ చేసిన రుతురాజ్‌

Oct 20 2026 1:42 PM | Updated on Oct 20 2026 1:42 PM

HUNDRED FOR RUTURAJ GAIKWAD IN RANJI TROPHY

source: IPL X

టీమిండియా యువ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఫార్మాట్‌ ఏదైనా చెలరేగిపోతున్నాడు. లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో, పొట్టి క్రికెట్‌లో ఇంచుమించు అదే తరహాలో  రాణిస్తున్న అతడు.. ఇటీవలికాలంలో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోనూ తన మార్కును చూపిస్తున్నాడు.

ఇటీవలే రంజీ ట్రోఫీలో తన సొంత జట్టులో చేరిన రుతు.. ప్రస్తుతం జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చేశాడు. ఈ సెంచరీకు మరో ప్రత్యేకత ఉంది. రుతు ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ పూర్తి చేశాడు. 172 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో అజేయమైన 101 పరుగులు చేశాడు.

రుతుకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇది 10వ శతకం. ఇప్పటికే అతడి ఖాతాలో 21 లిస్ట్‌-ఏ శతకాలు, 6 టీ20 శతకాలు ఉన్నాయి. ఇటీవలి ఫస్ట్‌ క్లాస్‌ ప్రదర్శనలతో రుతు ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌ అనిపించుకుంటున్నాడు. రుతురాజ్‌ న్యూజిలాండ్‌ పర్యటనలో జరుగబోయే వన్డే సిరీస్‌ కోసం భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఆ సిరీస్‌లో రుతురాజ్‌ ప్రదర్శనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాగా, జార్ఖండ్‌తో మ్యాచ్‌లో రుతురాజ్‌తో పాటు దిగ్విజయ్‌ పాటిల్‌ (148), అంకిత్‌ బావ్నే (169 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కడంతో మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (527-5 డిక్లేర్‌) చేసింది.  అంతకుముందు జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 169 పరుగులకే కుప్పకూలింది. విక్కీ ఓత్స్వాల్‌ 4, ప్రదీప్‌ దడే, తనయ్‌ సంఘ్వీ తలో 3 వికెట్లు తీశారు.

358 పరుగులు వెనుకపడి జార్ఖండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. మూడో రోజు రెండో సెషన్‌ సమయానికి ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఇంకా జార్ఖండ్‌ 334 పరుగులు వెనుకపడి ఉంది. 

ఇదీ చదవండి: Jasprit Bumrah: టాప్‌-10లో ఒకే ఒక్కడు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement