Jasprit Bumrah: టాప్‌-10లో ఒకే ఒక్కడు | Jasprit Bumrah is the only indian in ICC latest top 10 bowlers rankings | Sakshi
Sakshi News home page

Jasprit Bumrah: టాప్‌-10లో ఒకే ఒక్కడు

Oct 20 2026 10:17 AM | Updated on Oct 20 2026 10:17 AM

Jasprit Bumrah is the only indian in ICC latest top 10 bowlers rankings

source: X

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. స్టార్క్‌, మ్యాట్‌ హెన్రీ, ఓల్లీ రాబిన్సన్‌ టాప్‌-3లో కొనసాగుతుండగా.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆతర్వాతి స్థానాల్లో కమిన్స్‌, యాన్సెన్‌ ఉన్నారు.

హాజిల్‌వుడ్‌ రెండు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరగా.. రబాడ, బోలాండ్‌ తలో స్థానం కోల్పోయి 8,9 స్థానాలకు పడిపోయారు. పాక్‌ బౌలర్‌ నౌమన్‌ అలీ 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా మినహా టాప్‌-10 ఏ ఒక్క భారత బౌలర్‌ కూడా లేడు.

సిరాజ్‌ 16, రవీంద్ర జడేజా 19, కుల్దీప్‌ యాదవ్‌ 24, మానవ్‌ సుతార్‌ 43, ‍ప్రసిద్ద్‌ కృష్ణ 45, అక్షర్‌ పటేల్‌ 49, వాషింగ్టన్‌ సుందర్‌ 52 స్థానాల్లో ఉన్నారు. ఈ వారం​ ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘన్‌ బౌలర్లు ఇస్మత్‌ ఆల​ం, యమీన్‌ అహ్మద్‌జాయ్‌, మొహమ్మద్‌ సలీం , బంగ్లాదేశ్‌ బౌలర్లు హసన్‌ మహ్ముద్‌, ఎబాదత్‌ హొసేన్‌ భారీగా లబ్ది పొందారు.

బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. హ్యారీ బ్రూక్‌, స్టీవ్‌ స్మిత్‌, జో రూట్‌ టాప్‌-3లో కొనసాగుతుండగా.. భారత బ్యాటర్లు రిషబ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌ 7, 9 స్థానాల్లో కొనసాగుతున్నారు. మిగతా భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్‌ 12, రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ 28, 29, సుందర్‌ 47, జురెల్‌ 66, అక్షర్‌ పటేల్‌ 70 స్థానాల్లో ఉన్నారు. 

ఈ వారం ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్‌ మ్యాట్‌ రెన్షా ఏకంగా 147 స్థానాలు ఎగబాకి 49వ స్థానానికి చేరాడు. ఆఫ్ఘన్‌ బ్యాటర్లు రహ్మత్‌ షా 13 స్థానాలు, సెదిఖుల్లా అటల్‌ 41, బంగ్లా బ్యాటర్‌ తంజిద్‌ హసన్‌ 10 స్థానాలు ఎగబాకారు.

ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. జడేజా, యాన్సెన్‌, మెహిది హసన్‌ మిరాజ్‌ టాప్‌-3లో కొనసాగుతున్నారు. వాషింగ్టన్‌ సుందర్‌ 7, అక్షర్‌ పటేల్‌ 14 స్థానాల్లో ఉన్నారు. 

ఇదీ చదవండి: రషీద్‌ మాయాజాలం.. ఆఫ్ఘనిస్తాన్‌ ఘన విజయం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement