source: X
యూఏఈలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్‌కు చేరింది. నిన్న జింబాబ్వేపై 158 పరుగుల భారీ తేడాతో గెలుపొంది ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది.
సెదిఖుల్లా సెంచరీ
వన్‌డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (102) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (90) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (25), హష్మతుల్లా షాహిది (28).. కెప్టెన్ రహ్మత్ షా (7), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (8), మొహమ్మద్ నబీ (9), రషీద్ ఖాన్ (8), ఘజన్‌ఫర్ (6), జియా ఉర్ రహ్మాన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, మసుకు తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ 2, సికందర్ రజా ఓ వికెట్ దక్కించుకున్నారు.
295 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. 38.4 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. సికందర్ రజా (48), ర్యాన్ బర్ల్ (31) మాత్రమే కొంత ప్రతిఘటించారు. రషీద్ ఖాన్ నాలుగు వికెట్లతో మాయాజాలం.. ఫజల్ హక్ ఫారూఖీ రెండు వికెట్లతో సత్తా చాటాడు.
ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్‌రేట్ +3.160కు చేరింది. దీంతో అక్టోబర్ 23న జరగనున్న ఫైనల్‌లో ఆడేందుకు ఆ జట్టు అర్హత సాధించింది. మరో ఫైనల్ బెర్తు కోసం జింబాబ్వే, బంగ్లాదేశ్ పోటీపడనున్నాయి.
ఇదీ చదవండి: బీసీసీఐ సెలెక్టర్‌గా రమేశ్ పొవార్.. చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా


