భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ క్రికెటర్ రమేశ్ పవార్‌కు సెలక్షన్ కమిటీలో చోటు దక్కింది. అజిత్ అగార్కర్ స్థానంలో పవార్ నియామకం జరిగింది. మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనున్నాడు.
బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఇంటర్వ్యూల అనంతరం పవార్‌ను ఏకగ్రీవం చేశారు.
టీమిండియాకు ఆడిన అనుభవం.. కోచ్‌గా సేవలు
రమేశ్ పవార్ 2004 నుంచి 2007 మధ్య భారత జట్టు తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించాడు. భారత మహిళల జట్టుకు ప్రధాన కోచ్‌గా కూడా పనిచేశాడు.
ప్రజ్ఞాన్ ఓజా టెస్టుల్లో ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా సీనియారిటీతో కమిటీకి అధ్యక్షత వహించనున్నాడు. గతంలో అతడు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించాడు.
సెలక్షన్ కమిటీలో ఇతర సభ్యులు వీరే
ప్రజ్ఞాన్ ఓజా, రమేశ్ పవార్‌తో పాటు శివసుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా సెలక్షన్ కమిటీలో సభ్యులుగా కొనసాగనున్నారు.
మరోవైపు, అజిత్ అగార్కర్ తన పదవీకాలంలో అందించిన సేవలను బీసీసీఐ ప్రశంసించింది. ఆయన నాయకత్వంలో భారత్ మూడు ఐసీసీ టైటిళ్లు, రెండు ఆసియా కప్‌లు, రెండు ఆసియా క్రీడల స్వర్ణ పతకాలు సాధించినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: రంజీ ట్రోఫీలో సంచలనం.. 400 పరుగులు చేసిన అనామక ప్లేయర్


