source: X
రంజీ ట్రోఫీ 2026-27లో సంచలనం నమోదైంది. ఓ అనామక బ్యాటర్ ఏకంగా క్వాడ్రుపుల్ సెంచరీ (510 బంతుల్లో 46 ఫోర్లు, 7 సిక్సర్లతో 400 నాటౌట్) బాదాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ ఈ ఘనత సాధించాడు.
రంజీ ట్రోఫీ చరిత్రలో ఓ బ్యాటర్ 400 పరుగుల మార్కును తాకడం ఇది రెండోసారి మాత్రమే. 1948లో మహారాష్ట్ర తరఫున బిబి నింబాల్కర్ (443 నాటౌట్) తొలిసారి క్వాడ్రుపుల్ సెంచరీ సాధించాడు. 78 ఏళ్ల తర్వాత చిన్మయ్ సుతార్ తిరిగి ఈ ఘనత సాధించాడు.
రంజీ చరిత్రలో నింబాల్కర్, సుతార్ మినహా ఎవ్వరూ క్వాడ్రుపుల్ సెంచరీ సాధించలేదు. ఈ చారిత్రక స్కోర్ సాధించే క్రమంలో సుతార్ టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రికార్డును అధిగమించాడు. షా 2022లో అసోంపై 379 పరుగులు చేశాడు.
రంజీ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:
- 443* – భాసాహెబ్ నింబాల్కర్
- 400* – చిన్మయ్ సుతార్
- 379 – పృథ్వీ షా
- 377 – సంజయ్ మంజ్రేకర్
- 366 – ఎం.వి. శ్రీధర్
- 366 – తన్మయ్ అగర్వాల్
లారా, బ్రాడ్‌మన్ సరసన సుతార్
తాజా ప్రదర్శనతో సుతార్ దిగ్గజ బ్యాటర్లు డాన్ బ్రాడ్‌మన్, బ్రియాన్ లారా సరసన చేరాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వీరితో పాటు మరో ఆరుగురు మాత్రమే క్వాడ్రుపుల్ సెంచరీలు చేశారు. లారా,పోన్స్‌ఫర్ట్ తలో రెండు సార్లు ఈ ఘనత సాధించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ బ్రియాన్ లారా పేరిటే ఉంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:
- 501* - లారా
- 499 - హనీప్ మొహమ్మద్
- 452* - బ్రాడ్‌మన్
- 443* - నింబాల్కర్
- 437 - పోన్స్‌ఫర్డ్
- 429 - పోన్స్‌ఫర్డ్
- 428 - ఆఫ్తాబ్ బలోచ్
- 424 - మెక్‌లారెన్
- 410* -నార్త్‌ఈస్ట్
- 405* - గ్రేమ్ హిక్
- 400* - లారా
- 400* - చిన్మయ్ సుతార్
ఇదీ చదవండి: టీమిండియా బౌలర్ వరల్డ్ రికార్డు


