టీమిండియా బౌలర్‌ వరల్డ్‌ రికార్డు | Niki Prasad Creates Huge World Record For India Women in 2nd T20I Vs Zimbabwe | Sakshi
Sakshi News home page

టీమిండియా బౌలర్‌ వరల్డ్‌ రికార్డు

Oct 19 2026 3:56 PM | Updated on Oct 19 2026 3:59 PM

Niki Prasad Creates Huge World Record For India Women in 2nd T20I Vs Zimbabwe

source: X

భారత మహిళా క్రికెటర్‌ నికీ ప్రసాద్‌ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. తన అంతర్జాతీయ బౌలింగ్ కెరీర్‌లో వేసిన తొలి రెండు బంతుల్లోనే వికెట్లు పడగొట్టిన రెండో మహిళా క్రికెటర్‌గా, ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ జట్లలో తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది.

నికీకి ముందు అమెరికాకు చెందిన అనిసా రావ్ 2019లో బంగ్లాదేశ్‌పై తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి రెండు బంతుల్లోనే వికెట్లు తీసింది. తాజాగా నికీ ఆమె సరసన నిలిచింది. రాయ్‌పూర్‌ వేదికగా నిన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో నికీ ఈ ఘనత సాధించింది.

నికీకి అంతర్జాతీయ కెరీర్‌లో ఇది రెండో మ్యాచ్‌ అయినప్పటికీ.. ఈ మ్యాచ్‌లోనే ఆమె బౌలింగ్‌ అరంగేట్రం చేసింది.

జింబాబ్వే 14 ఓవర్లలో 75/3 స్కోర్‌ వద్ద ఉన్న దశలో కెప్టెన్ స్మృతి మంధాన బంతిని నికీకి అందించింది. తొలి బంతికే నికీ చిపో ముగేరి-తిరిపానో (34)ను ఔట్‌ చేసింది. ఆతర్వాత న్యాషా గ్వాంజురాను రెండో బంతికి పెవిలియన్‌కు పంపింది. హ్యాట్రిక్ అవకాశం చేజార్చుకున్న నికీ.. మొత్తంగా రెండు ఓవర్లలో ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసింది. నికీ దెబ్బకు జింబాబ్వే 20 ఓవర్లలో 102/8కే పరిమితమైంది.

అనంతరం ఓపెనర్లు షఫాలీ వర్మ (55), స్మృతి మంధన (47 నాటౌట్‌) చెలరేగడంతో భారత్‌ సునాయాస విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని నామామాత్రపు చివరి టీ20 అక్టోబర్‌ 20న జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభమవుతుంది. వన్డే మ్యాచ్‌లు అక్టోబర్‌ 23, 25, 28 తేదీల్లో జరుగనున్నాయి.

ఇదీ చదవండి: చెలరేగిన ఓపెనర్లు.. సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement