breaking news
Niki Prasad
-
టీమిండియా బౌలర్ వరల్డ్ రికార్డు
భారత మహిళా క్రికెటర్ నికీ ప్రసాద్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించింది. తన అంతర్జాతీయ బౌలింగ్ కెరీర్లో వేసిన తొలి రెండు బంతుల్లోనే వికెట్లు పడగొట్టిన రెండో మహిళా క్రికెటర్‌గా, ఐసీసీ ఫుల్ మెంబర్ జట్లలో తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది.నికీకి ముందు అమెరికాకు చెందిన అనిసా రావ్ 2019లో బంగ్లాదేశ్‌పై తన అంతర్జాతీయ కెరీర్లో తొలి రెండు బంతుల్లోనే వికెట్లు తీసింది. తాజాగా నికీ ఆమె సరసన నిలిచింది. రాయ్‌పూర్ వేదికగా నిన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో నికీ ఈ ఘనత సాధించింది.నికీకి అంతర్జాతీయ కెరీర్లో ఇది రెండో మ్యాచ్ అయినప్పటికీ.. ఈ మ్యాచ్‌లోనే ఆమె బౌలింగ్ అరంగేట్రం చేసింది.జింబాబ్వే 14 ఓవర్లలో 75/3 స్కోర్ వద్ద ఉన్న దశలో కెప్టెన్ స్మృతి మంధాన బంతిని నికీకి అందించింది. తొలి బంతికే నికీ చిపో ముగేరి-తిరిపానో (34)ను ఔట్ చేసింది. ఆతర్వాత న్యాషా గ్వాంజురాను రెండో బంతికి పెవిలియన్‌కు పంపింది. హ్యాట్రిక్ అవకాశం చేజార్చుకున్న నికీ.. మొత్తంగా రెండు ఓవర్లలో ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసింది. నికీ దెబ్బకు జింబాబ్వే 20 ఓవర్లలో 102/8కే పరిమితమైంది.అనంతరం ఓపెనర్లు షఫాలీ వర్మ (55), స్మృతి మంధన (47 నాటౌట్) చెలరేగడంతో భారత్ సునాయాస విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని నామామాత్రపు చివరి టీ20 అక్టోబర్ 20న జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. వన్డే మ్యాచ్‌లు అక్టోబర్ 23, 25, 28 తేదీల్లో జరుగనున్నాయి.ఇదీ చదవండి: చెలరేగిన ఓపెనర్లు.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా -
స్వల్ప ఛేదనలో తడబాటు
రాయ్‌పూర్: స్మృతి మంధాన పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగిన మొదటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తడబడుతూనే గెలుపు తీరం చేరింది. బలహీన ప్రత్యర్థి జింబాబ్వేపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించడంలో జట్టు విఫలమైంది. శుక్రవారం జరిగిన తొలి టి20లో భారత్ 4 వికెట్ల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. షార్నే మాయర్స్ (33 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెలిస్ ఎన్లొవు (44 బంతుల్లో 42; 7 ఫోర్లు) రాణించారు. ఆంధ్ర లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి, నందని శర్మ పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేశారు. అనంతరం భారత్ 15.4 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అయితే ఈ గెలుపు సులువుగా దక్కలేదు. ఛేదనలో ఇబ్బంది పడిన టీమ్ 19 పరుగులకే తొలి 4 వికెట్లు చేజార్చుకుంది. ఐదు పరుగుల వ్యవధిలో స్మృతి (9), అనుష్క (4), హర్మన్‌ప్రీత్ (1), షఫాలీ (4) అవుటయ్యారు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (37 బంతుల్లో 49; 8 ఫోర్లు), తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న నికీ ప్రసాద్ (35 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 63 బంతుల్లో 82 పరుగులు జోడించి కీలక పాత్ర పోషించడంతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే జట్టు విజయం ఖాయమైంది. సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో టి20 ఆదివారం ఇదే మైదానంలో జరుగుతుంది.95 ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన నికీ ప్రసాద్ టి20ల్లో భారత్ తరఫున బరిలోకి దిగిన 95వ ప్లేయర్‌గా నిలిచింది. -
19 పరుగులకే 4 వికెట్లు.. అయినా భారత్ అద్భుత విజయం
రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.జింబాబ్వే బ్యాటర్లలో కెలిస్ ఎండ్లోవు (44 బంతుల్లో 42), షార్నే మేయర్స్ (33 బంతుల్లో 43 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో నందిని శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. షెఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, శ్రీచరణి తలా వికెట్ సాధించారు.అరంగేట్రంలో అదుర్స్అనంతరం 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు జింబాబ్వే రైటార్మ్ స్పిన్నర్ నిషా గ్వాంజురా బిగ్ షాకిచ్చింది. కెప్టెన్ స్మృతి మంధానతో పాటు షెఫాలీ వర్మ, అనుష్కశర్మ(4)లను ఆరంభంలోనే నిషా గ్వాంజురా పెవిలియన్‌కు పంపింది.మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా కేవలం ఒక్క పరుగు చేసి ఔటయైంది. దీంతో భారత్ కేవలం 19 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (49), అరంగేట్ర బ్యాటర్ నికి ప్రసాద్ (39 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును ఆదుకున్నారు. ఫలితంగా ఈ స్వల్ప లక్ష్యాన్ని ఉమెన్ ఇన్ బ్లూ 15.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.చదవండి: మొయిన్ అలీ మెరుపులు.. ఫైనల్లో ఇంగ్లండ్.. ఏబీడీకి షాక్! -
జింబాబ్వేతో టీ20.. భారత్ బౌలింగ్.. యువ ప్లేయర్ అరంగేట్రం
భారత మహిళల క్రికెట్ జట్టు స్వదేశంలో జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం నాటి తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ సిరీస్‌తో భారత జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన ప్రయాణం మొదలుపెట్టింది.అందుకే ముందుగా బౌలింగ్అంతేకాదు రాయ్‌పూర్‌లో మహిళల అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలి మ్యాచ్ కావడం మరో విశేషం. ఇక టాస్ సందర్భంగా భారత జట్టు సారథి స్మృతి మంధాన మాట్లాడుతూ.. ‘‘మంచు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ముందుగా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము. చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధమయ్య క్రమంలో మేము ఎక్కువగా రాత్రి వేళల్లో మంచు పడే వేళ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.తుదిజట్టు ఎంపిక కష్టమేకాబట్టి ఇది సరైన నిర్ణయం అనుకుంటున్నాం. మా జట్టులో ప్రతిభావంతులైన యువ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి తుదిజట్టు ఎంపిక కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక ఈరోజు మేము ముగ్గురు పేసర్లు, ఇద్దరు ప్రధాన స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ ఆరో ఆప్షన్‌గా ఉంటుంది.వాళ్లకు చోటు లేదుఅయితే, జట్టు కూర్పు దృష్ట్యా దురదృష్టవశాత్తూ ప్రేమా రావత్, జింతిమణి కలిత, మిన్ను మణి, కమలిని తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వారంతా మంచి ప్లేయర్లే. కానీ ప్రస్తుత కాంబినేషన్లో వాళ్లకు అవకాశం లేకుండా పోయింది.ఈరోజు నికీ ప్రసాద్ అరంగేట్రం చేస్తోంది. ఇక కెప్టెన్‌గా గతంలోనూ జట్టును ముందుకు నడిపించాను. మహిళల ప్రీమియర్ లీగ్‌లోనూ సారథిగా నాకు అనుభవం ఉంది. కాబట్టి కెప్టెన్సీ గురించి కొత్తగా ఆలోచించాల్సింది ఏమీ లేదు’’ అని పేర్కొంది. నికీ అరంగేట్రంకాగా 20 ఏళ్ల నికీ ప్రసాద్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఆమె.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా. భారత అండర్-19 జట్టు తరఫున, ఇటీవల ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన అనధికారిక సిరీస్‌లోనూ నికీ రాణించింది. ఫలితంగా ఆమెకు భారత టీ20 జట్టు తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. కెప్టెన్ స్మృతి మంధాన చేతుల మీదుగా నికీ టీమిండియా క్యాప్ అందుకుంది. భారత్ వర్సెస్ జింబాబ్వే తొలి టీ20 తుదిజట్లుభారత్షఫాలీ వర్మ, స్మృతి మంధాన(కెప్టెన్), అనుష్క శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, నికీ ప్రసాద్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి, నందనీ శర్మ, క్రాంతి గౌడ్.జింబాబ్వేకెలిస్ ఎంధ్లోవు, బిలవ్డ్ బిజా, చిపో ముగేరి-టిరిపానో, షేర్న్ మేయర్స్, మిచెల్లి మవూంగ, నైయాషా గ్వాన్జురా, ఫ్రాన్సిస్క చిపారే, మాడెస్టర్ ముపాచిక్వా (వికెట్ కీపర్), జోసెఫైన్ ఎంకోమో (కెప్టెన్), ఒలిండెర్ చారే, టెండాయ్ మకూష.చదవండి: IND vs WI: విండీస్‌తో ఐదో టీ20.. భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన -
ఏకైక టెస్టులో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్
ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 281 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది.టీ20 సిరీస్‌లో పరాభవంకాగా అనధికారిక సిరీస్‌లలో భాగంగా మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, ఏకైక టెస్టు ఆడేందుకు ఆసీస్ మహిళల జట్టు భారత పర్యటనకు వచ్చింది. తొలుత టీ20 సిరీస్ జరుగగా ఆసీస్.. అనూహ్య రీతిలో భారత జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.వన్డే సిరీస్ కైవసంఅయితే, వన్డే సిరీస్‌ను మాత్రం భారత మహిళల జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ధర్మశాల వేదికగా మంగళవారం ఏకైక టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన భారత మహిళల ‘ఎ’ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.364 పరుగులు చేసి ఆలౌట్ఓపెనర్లు శుభా సతీశ్ (59) , ప్రియా పునియా (46) శుభారంభం అందించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ అనుష్క శర్మ (44) కూడా రాణించింది. అయితే, ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన తనీషా సింగ్ (92), నికీ ప్రసాద్ (91) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 364 పరుగులు చేసి ఆలౌట్ అయింది.కుప్పకూలిన ఆసీస్ఆసీస్ బౌలర్లలో లిల్లీ మిల్స్ నాలుగు, చార్లి నాట్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. టెస్ ఫ్లింటాఫ్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, ఫ్రాంకీ నిక్లిన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ కేవలం 176 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లలో కెప్టెన్ రేచల్ ట్రెనామన్ (44), వికెట్ కీపర్ బ్యాటర్ తామిలా విల్సన్ (35) ఓ మోస్తరుగా రాణించారు.భారత బౌలర్లలో వైష్ణవి శర్మ ఆరు వికెట్లతో చెలరేగి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. మిగిలిన వారిలో శుచి ఉపాధ్యాయ్, నికీ ప్రసాద్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగుల ఆధిక్యం లభించింది.భారీ లక్ష్యంఅనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు 257 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ ప్రియా పునియా అర్ధ శతకం (59) బాదగా.. యస్తికా భాటియా 46, అనుష్మ శర్మ 48 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్ లిల్లీ మిల్స్ ఐదు వికెట్లు పడగొట్టగా.. ఫ్రాంకీ నిక్లిన్ నాలుగు, చార్లీ నాట్ ఒక వికెట్ దక్కించుకున్నారు.281 పరుగుల తేడాతో జయభేరిఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్ ఆసీస్‌కు 446 పరుగుల మేర భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో కంగారూ జట్టు 164 పరుగులకే కుప్పకూలడంతో.. గురువారం నాటి ఆట సందర్భంగా భారత్ 281 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. నికీ ప్రసాద్ ఐదు వికెట్లతో చెలరేగగా.. వైష్ణవి శర్మ మూడు, శుచి ఉపాధ్యాయ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న 20 ఏళ్ల నికీ ప్రసాద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: వన్డే వరల్డ్‌కప్-2027... టీమిండియా షెడ్యూల్ ఇదే -
భారత స్పిన్నర్ ఆరు వికెట్ల ప్రదర్శన.. ఆసీస్ 176 ఆలౌట్
ధర్మశాల వేదికగా ఇండియా వుమెన్-ఎ జట్టుతో జరుగుతున్న ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఎ జట్టు 176 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగుల భారీ ఆధిక్యం లభించినట్లయింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ రాచెల్ ట్రెనామన్ (44) టాప్ స్కోరర్‌గా నిలవగా, వికెట్ కీపర్ తాహిలా విల్సన్ (35) పరుగులతో పర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో స్పిన్నర్ వైష్ణవి శర్మ ఆరు వికెట్లతో చెలరేగగా, శుచి ఉపాధ్యాయ్, నికీ ప్రసాద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. తనీశా సింగ్ (92), నికీ ప్రసాద్ (91) సెంచరీలు మిస్ చేసుకోగా, ఓపెనర్ శుభా సతీష్ (59) అర్థసెంచరీ సాధించింది. లిల్లీ మిల్స్ నాలుగు వికెట్లు తీసింది.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. శుభా సతీశ్ (11), ప్రియా పూనియా (2) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం భారత్ 202 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.𝐀 𝐦𝐚𝐬𝐬𝐢𝐯𝐞 𝟏𝟖𝟖-𝐫𝐮𝐧 𝐟𝐢𝐫𝐬𝐭-𝐢𝐧𝐧𝐢𝐧𝐠𝐬 𝐥𝐞𝐚𝐝 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 𝐀 👏𝐈𝐧𝐝𝐢𝐚 𝐀: 𝟑𝟔𝟒/𝟏𝟎 (𝟏𝟎𝟑.𝟑)Tanisha Singh - 92 (166)Niki Prasad - 91 (112)Lilly Mills - 4/98 (32.3)𝐀𝐮𝐬𝐭𝐫𝐚𝐥𝐢𝐚 𝐀: 𝟏𝟕𝟔/𝟏𝟎 (𝟔𝟑.𝟒)Rachel Trenaman - 44 (88)… pic.twitter.com/s0Jona9ayS— Female Cricket (@imfemalecricket) September 30, 2026ఇదీ చదవండి: వెస్టిండీస్ ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ -
ఆసీస్‌ను చితకొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజు ముగిసిన ఆట
ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియా-ఎ వుమెన్‌తో జరుగుతున్న ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు పట్టు బిగించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 100 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. తనిషా సింగ్ (166 బంతుల్లో 92) సెంచరీ చేజార్చుకోగా, నికీ ప్రసాద్ (78 నాటౌట్), శుచి ఉపాధ్యాయ్ క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ శుభా సతీశ్ (59), అర్థసెంచరీ సాధించగా, ప్రియా పూనియా (46), అనుష్క శర్మ (44) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లిల్లీ మిల్స్, చార్లీ నాట్ చెరో 3 వికెట్లు తీయగా, టెస్ ఫ్లింటాఫ్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, ఫ్రాంకీ నిక్లిన్ తలా ఒక వికెట్ తీశారు. 120 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన క్రమంలో అనుష్క శర్మతో కలిసి తనిశా సింగ్ ఐదో వికెట్‌కు 82 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం అనుష్క ఔటైనప్పటికీ, క్రీజులోకి వచ్చిన నికీ ప్రసాద్ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. సెంచరీ వైపు పరిగెడుతున్న తనిశా సింగ్‌ను టెస్ ఫ్లింటాఫ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చింది. అయితే నికీ ప్రసాద్ మాత్రం మరో ఎండ్‌లో ధాటిగా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే భారత్ స్కోరు 350 మార్క్‌ను దాటింది.𝐈𝐧𝐝𝐢𝐚 𝐀 𝐫𝐞𝐚𝐜𝐡 𝟑𝟓𝟏/𝟗 𝐚𝐭 𝐬𝐭𝐮𝐦𝐩𝐬 𝐨𝐧 𝐃𝐚𝐲 𝟏! 💪Tanisha Singh (92), Niki Prasad (78* ) and Shubha Satheesh (59) anchored India's innings 🏏Lilly Mills (3/94) and Charli Knott (3/82) led Australia A's bowling 👏 #CricketTwitter pic.twitter.com/Os0sDsSCzb— Female Cricket (@imfemalecricket) September 29, 2026ఇదీ చదవండి: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. అద్భుతం చేసిన అథ్లెట్లు -
బ్యాటర్ల విధ్వంసం.. భారత్ సంచలన విజయం; సిరీస్ కైవసం
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా-ఎ వుమెన్‌తో జరిగిన మూడో అనధికారిక వన్డేలో భారత-ఎ జట్టు 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 363 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా-ఎ జట్టు 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత బ్యాటర్లలో మిన్నూ మాని (56 బంతుల్లో 88 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించగా, నిక్కీ ప్రసాద్ (76), కెప్టెన్ అనుష్క శర్మ (58), తనీషా సింగ్ (60) అర్థశతకాలతో రెచ్చిపోయారు. జట్టులో నలుగురు బ్యాటర్లు అర్థశతకాలు చేసి తమ విలువైన భాగస్వామ్యాలతో జట్టును విజయపథంలో నడిపించారు. ఆసీస్ బౌలర్లలో చార్లీ నాట్, లిల్లీ మిల్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వుమెన్ చార్లీ నాట్ (70 బంతుల్లో 109; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో విధ్వంసం సృష్టించగా, కౌర్ట్నీ వెబ్ (92 బంతుల్లో 95) రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, నికీ ప్రసాద్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.ఇదీ చదవండి: రెండుగా చీలిన భారత్; దంచేసిన కోహ్లి, రోహిత్.. గిల్ ప్లాఫ్ షో! -
సెంచరీ బాదిన ఆసీస్ బ్యాటర్.. భారత్ ముంగిట భారీ లక్ష్యం
మొహలీ వేదికగా ఇండియా-ఎ వుమెన్‌తో జరుగుతున్న అనధికారిక మూడో వన్డేలో ఆస్ట్రేలియా వుమెన్ భారీ స్కోరు సాధించింది. చార్లీ నాట్ (70 బంతుల్లో 109; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో విధ్వంసం సృష్టించగా, కౌర్ట్నీ వెబ్ (92 బంతుల్లో 95) రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో కెప్టెన్ తాహిలా విల్సన్ (38), రాచెల్ త్రినెమన్ (29) పర్వాలేదనిపించారు. చివర్లో హేలీ సిల్వర్ హోమ్స్ (8 బంతుల్లో 19 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆస్ట్రేలియా 360 పరుగుల మార్క్‌ను దాటింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, నికీ ప్రసాద్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.కాగా మూడో వికెట్‌కు చార్లీ నాట్, కౌర్ట్నీ వెబ్ 116 బంతుల్లో 166 పరుగులు జోడించి ఆసీస్ భారీ స్కోరు సాధించడంలో సహాయపడ్డారు. కాగా ఇరుజట్లు చెరో వన్డే గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. -
ఆఖరి వరకు ఉత్కంఠ: ఆసీస్‌తో రెండో వన్డేలో భారత్ ఓటమి
ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు చేతిలో భారత మహిళా ‘ఎ’ జట్టుకు పరాజయం ఎదురైంది. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి రెండో అనధికారిక వన్డేలో పర్యాటక ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఆల్ ఫార్మాట్ సిరీస్‌కాగా మూడు అనధికారిక టీ20లు, మూడు అనధికారిక వన్డేలు, ఒక అనధికారిక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళల జట్టు భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా టీ20 సిరీస్‌ను కంగారూ జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.ఈ క్రమంలో భారత్- ఆసీస్ మహిళల ‘ఎ’ జట్ల మధ్య ఆదివారం నుంచి వన్డే సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, తాజాగా రెండో వన్డేలో మాత్రం ఓటమిపాలైంది.మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో బుధవారం టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు తనీశా సింగ్ (37), ప్రియా పునియా (36) శుభారంభం అందించగా.. కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా శతక్కొట్టింది.కెప్టెన్ విధ్వంసకర శతకంమొత్తంగా 84 బంతులు ఎదుర్కొన్న యస్తికా.. 16 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 112 పరుగులు సాధించింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ విధ్వంసకర శతకంతో చెలరేగగా.. తేజల్ హసాబ్నిస్ (60), అనుష్క శర్మ (60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో దుమ్ములేపారు. మిగిలిన వారిలో నికీ ప్రసాద్ డకౌట్ కాగా.. మిన్ను మణి (3) విఫలమైంది. ఆఖర్లో సయాలీ సత్గరే 12 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచింది.ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి భారత్ 338 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇక ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. మిల్లీ ఇల్లింగ్‌వర్త్ రెండు వికెట్లు కూల్చింది. లిల్లీ మిల్స్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ నికోలీ ఫాల్తుమ్ (12)ను సయాలీ సత్గరే తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపింది. అయితే, భారత శిబిరానికి ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.మెరుపులు మెరిపించారుమరో ఓపెనర్, కెప్టెన్ తాహిలా విల్సన్ (79), వన్‌డౌన్ బ్యాటర్ అనికా లిరాయిడ్ (54) అర్ధ శతకాలతో దుమ్మురేపారు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ చార్లి నాట్ (37 బంతుల్లోనే 63) టీ20 తరహాలో మెరుపులు మెరిపించింది. మిగిలిన వారిలో టెస్ ఫ్లింటాఫ్ (38), హేలీ సిల్వర్ హోమ్స్ (47) కూడా రాణించారు.లిల్లీ మిల్స్ 12 పరుగులు చేయగా.. ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి కేవలం ఐదు పరుగులు కావాల్సి వచ్చింది. అప్పటికి మిల్లీ ఇల్లింగ్‌వర్త్ 18, డేసీ బ్రౌన్ ఒక పరుగుతో ఉన్నారు. చివరి ఓవర్లో నికీ ప్రసాద్ బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతి వైడ్ అయింది.ఆఖరి ఓవర్లో ఉత్కంఠ.. చివరికిమరుసటి బంతికి పరుగు తీయలేకపోయి బ్రౌన్.. రెండో బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ మిల్లీకి ఇచ్చింది. ఈ క్రమంలో మూడో బంతి నోబాల్ కాగా.. తద్వారా లభించిన ఫ్రీ హిట్‌ను మిల్లీ ఫోర్‌గా మలిచింది. దీంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ జయభేరి మోగించింది. 49.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి.. రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది.భారత బౌలర్లలో మిన్ను మణి మూడు వికెట్ల తీయగా.. నికీ ప్రసాద్, సయాలి సత్గరే చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. వైష్ణవి శర్మ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది. భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఇందుకు మొహాలీ వేదిక.చదవండి: సెహ్వాగ్ కొడుకు మెరుపులు.. కెప్టెన్ సెంచరీ.. ఆసీస్‌పై భారత్ గెలుపు -
IND vs AUS: తొలి ‘వన్డే’లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
ఆస్ట్రేలియా- ‘ఎ’ మహిళలతో అనధికారిక వన్డే సిరీస్‌ను భారత్ గెలుపుతో ఆరంభించింది. మొహాలీ వేదికగా తొలి వన్డేలో పర్యాటక జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌లో భారత మహిళల ‘ఎ’ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.టీ20 సిరీస్‌లో పరాభవం.. క్లీన్స్వీప్కాగా మూడు అనధికారిక టీ20, మూడు వన్డే, ఏకైక టెస్టు ఆడేందుకు ఆసీస్ మహిళల ‘ఎ’ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా.. భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆసీస్ ఆతిథ్య జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఆదివారం తొలి అనధికారిక వన్డే జరిగింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో టాస్ గెలిచిన భారత్-‘ఎ’ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 46.3 ఓవర్లలో 235 పరుగులు చేసి ఆలౌట్ అయింది.రాణించిన భారత బౌలర్లుఆసీస్ ఓపెనర్లలో రేచల్ ట్రెనామన్ (36), కెప్టెన్ తహీలా విల్సన్ (48).. చరిల్ నాట్ (39) మెరుగైన ప్రదర్శన కనబరిచారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, నికీ ప్రసాద్ చెరో మూడు వికెట్లు కూల్చగా.. అమన్‌దీప్ కౌర్ రెండు, సయాలీ సత్గరే ఒక వికెట్ పడగొట్టారు.తేజల్, అనుష్క హాఫ్ సెంచరీలుఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత మహిళా జట్టు.. 41.1 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ తేజల్ హసాబ్నిస్ అద్భుత అర్ధ శతకం (81) సాధించగా.. అనుష్క శర్మ సైతం హాఫ్ సెంచరీ (55)తో మెరిసింది. లోయర్ ఆర్డర్లో నికీ ప్రసాద్ (22 బంతుల్లో 32 నాటౌట్) మెరుపులు మెరిపించగా.. సయాలీ సత్గరే (25) కూడా రాణించింది.ఫలితంగా భారత్ 41.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసి.. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్, ఆసీస్ మహిళల ‘ఎ’ జట్ల మధ్య శుక్రవారం రెండో అనధికారిక వన్డే జరుగనుండగా.. ఇందుకు మొహాలీ వేదిక.చదవండి: అభిషేక్- వైభవ్... ఇక్కడ సింహాలు.. అక్కడ పిల్లులు!


