breaking news
Quadruple Century
-
అందుకే లారా క్వాడ్రపుల్ సెంచరీ (400) రికార్డును బద్దలు కొట్టలేదు: వియాన్ ముల్దర్
జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (367) చెలరేగాడు. ఈ ట్రిపుల్‌తో ముల్దర్ చాలా రికార్డులను బద్దలు కొట్టాడు.విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా..సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా..టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఈ రికార్డులన్నీ పక్కన పెడితే ముల్దర్ ఓ చారిత్రక రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశాన్ని వదిలేసి వార్తల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే అవకాశాన్ని ముల్దర్ చేజేతులారా జారవిడిచాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రమే క్వాడ్రపుల్ సెంచరీ చేశాడు.మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన ముల్దర్.. క్వాడ్రపుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్) ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో కాని ఇలాంటి అవకాశం రాదు. అలాంటిది ముల్దర్ ఈ అవకాశాన్ని వదిలేసి చారిత్రక తప్పిదం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముల్దర్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి సంచలన నిర్ణయం తీసకున్నాడు.తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. అత్యంత అరుదుగా వచ్చే అవకాశాన్ని కాదనుకొని ముల్దర్ చాలా పెద్ద తప్పిదం చేశాడని వాపోతున్నారు. ప్రస్తుత జమానాలో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఈ ఇన్నింగ్స్ అనంతరం వియాన్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడంపై స్పందించాడు. లారా ఓ దిగ్గజం. అలాంటి ఆటగాడి పేరు మీదనే క్వాడ్రపుల్ సెంచరీ రికార్డు ఉండాలి. ఆ రికార్డును నిలబెట్టుకోవడానికి అతను అర్హుడు. నాకు మళ్లీ క్వాడ్రపుల్ సెంచరీ చేసే అవకాశం వచ్చినా ఇలాగే చేస్తాను. ఈ విషయాన్ని షుక్రీ కాన్రడ్తో (దక్షిణాఫ్రికా హెడ్ కోచ్) చెప్పాను. అతను కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు. లంచ్ విరామం తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. మ్యాచ్ గెలవడానికి సరిపడా స్కోర్ చేశామని భావించాను. ఈ రెండు కారణాల చేత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.MULDER TALKS ABOUT HIS DECLARATION:"Lara's Record is exactly where it Should be". pic.twitter.com/PWwKGlvoL6— Johns. (@CricCrazyJohns) July 7, 2025ముల్దర్ కామెంట్స్ విన్న తర్వాత యావత్ క్రికెట్ ప్రపంచం అతనికి సెల్యూట్ కొట్టింది. దిగ్గజాలను గౌరవించే సంస్కారవంతమైన క్రికెటర్ అంటూ జేజేలు పలికింది. లారా క్వాడ్రపుల్ రికార్డును త్యాగం చేసి చిరకాలం తన పేరును స్మరించుకునేలా చేశాడని కామెంట్లు చేస్తుంది. నిస్వార్థ నాయకుడు, గొప్ప ఆటగాడని కీర్తిస్తుంది. వ్యక్తిగత రికార్డులు కాకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చూడలేమని జేజేలు పలుకుతుంది.వియాన్ లారా క్వాడ్రపుల్ సెంచరీ రికార్డు కాదనుకున్నా టెస్ట్‌ల్లో ఐదో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్), మాథ్యూ హేడెన్ (380), బ్రియాన్ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్ కంటే ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్దర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు) చెలరేగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30, వెర్రిన్ 42 (నాటౌట్) పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం సౌతాఫ్రికా బౌలర్లు కూడా రెచ్చిపోవడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఫాలో ఆన్ ఆడుతుంది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌ను సుబ్రాయన్ (10-1-42-4), కోడి యూసఫ్ (7-1-20-2), కార్బిన్ బాష్ (7-1-27-1), ముత్తస్వామి (13-2-59-1) కుప్పకూల్చారు. అజేయ ట్రిపుల్‌తో రికార్డులను తిరగరాసిన ముల్దర్ బౌలింగ్‌లోనూ రాణించాడు. 6 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (83 నాటౌట్) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఫాలో ఆన్ ఆడుతూ జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. 31 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే స్కోర్ 51/1గా ఉంది. కైటానో (34), నిక్ వెల్చ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే మరో 405 పరుగులు చేయాలి. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. -
క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని జట్టు ప్రయోజనాల కోసం తృణప్రాయంగా వదిలేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ముల్దర్ రెండో రోజు తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసి, క్వాడ్రపుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్) ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ముల్దర్ తీసుకున్న ఈ అత్యంత సాహసోపేత నిర్ణయానికి యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది.టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో కాని ఇలాంటి సువర్ణావకాశం రాదు. ముల్దర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాన్ని చేజేతులారా జారవిడిచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముల్దర్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ జమానా టెస్ట్ క్రికెట్లో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని బాధపడుతున్నారు. ఆటలో వేగం పెరిగిపోవడంతో డబుల్ సెంచరీలు చేయడమే ఎక్కువని క్రికెటర్లు భావిస్తున్నారు.ఏది ఏమైనా ముల్దర్ చేసిన పనికి విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులచే కీర్తించబడుతున్నాడు. నిస్వార్థ నాయకుడని జేజేలందుకుంటున్నాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చరిత్రలో చూడలేమని సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఒకే ఒక్కరు క్వాడ్రపుల్ సెంచరీ చేశారు. 2004లో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఇంగ్లండ్‌పై ఈ ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్), మాథ్యూ హేడెన్ (380), బ్రియాన్ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్ కంటే ముందున్నారు. క్వాడ్రపుల్ మిస్ చేసుకున్నప్పటికీ ముల్దర్ మరో ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అలాగే సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు గ్రేమ్ స్మిత్ పేరిట ఉండేది. స్మిత్ 2003లో ఓ టెస్ట్ మ్యాచ్‌లో 362 పరుగులు (277 & 85) చేశాడు.దీనితో పాటు ముల్దర్ మరిన్ని రికార్డులు కూడా సాధించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా (టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ (278 బంతుల్లో) పేరిట ఉంది).. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.విదేశీ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..367* - వియాన్ ముల్డర్ (SA) vs ZIM, బులవాయో, 2025337 - హనీఫ్ మొహమ్మద్ (PAK) vs WI, బార్బడోస్, 1958336* - వాలీ హమ్మండ్ (ENG) vs NZ, ఆక్లాండ్, 1933334* - మార్క్ టేలర్ (AUS) vs PAK, పెషావర్, 1998334 - సర్ డాన్ బ్రాడ్‌మాన్ (AUS) vs ENG, హెడింగ్లీ, 1930మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముల్దర్ 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓవర్‌నైట్ స్కోర్ 264 వద్ద రెండో రోజు బరిలోకి దిగిన ముల్దర్.. తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. ముల్దర్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు.ముల్దర్ చెలరేగడంతో సౌతాఫ్రికా లంచ్ తర్వాత 626/5 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ముల్దర్‌తో పాటు వెర్రిన్ (42) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30 పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.