జ‌స్ప్రీత్ బుమ్రా సంచ‌ల‌న నిర్ణ‌యం! | Jasprit Bumrah turned down Mumbai Indians request to be Rohit Sharmas deputy | Sakshi
Sakshi News home page

IPL 2027: జ‌స్ప్రీత్ బుమ్రా సంచ‌ల‌న నిర్ణ‌యం!

Nov 28 2026 1:54 PM | Updated on Nov 28 2026 2:36 PM

Jasprit Bumrah turned down Mumbai Indians request to be Rohit Sharmas deputy

PC: BCCI/X

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ తిరిగి ఎంపికైన సంగ‌తి తెలిసిందే. గ‌త మూడు సీజ‌న్లుగా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ కావ‌డంతో రోహిత్‌కు తిరిగి ప‌గ్గాల‌ను అప్ప‌గించారు. కెప్టెన్సీ రేసులో తిల‌క్ వ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్, జ‌స్ప్రీత్ బుమ్రా పేర్లు వినిపించిన‌ప్ప‌టికి.. ముంబై యాజ‌మాన్యం మాత్రం హిట్‌మ్యాన్ వైపే మొగ్గు చూపింది.

వైస్ కెప్టెన్సీని వద్దన్న బుమ్రా

అయితే స్టార్ పేస‌ర్ జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ కాకుండా రోహిత్‌కు డిప్యూటీగా ఉండే బాధ్యతను యాజమాన్యం ఆఫర్ చేసింది. అక్టోబర్ మొదటి వారంలో ఫ్రాంచైజీ పెద్దలు ఈ ప్రతిపాదన తీసుకురాగా.. బుమ్రా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అందుకు గ‌ల కార‌ణాల‌ను మాత్రం అత‌డు బ‌య‌ట‌పెట్ట‌లేదు.

కాగా గత సీజన్‌లో హార్దిక్ గైర్హాజరీలో బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన విష‌యం తెలిసిందే. జ‌స్ప్రీత్ గ‌త 13 ఏళ్లగా ముంబై జ‌ట్టులోనే కొన‌సాగుతున్నాడు. 2013లో 19 ఏళ్ల కుర్రాడిగా ముంబై తరఫున అరంగేట్రం చేసిన బుమ్రా.. ఇప్పటివరకు 14 సీజన్లలో 187 వికెట్లు పడగొట్టి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు.  డిసెంబర్‌లో 32వ ఏట అడుగుపెట్టనున్న బుమ్రాకు ముంబై కెప్టెన్ అయ్యే చివరి అవకాశం చేజారినట్లే అని చెప్పుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement