సిక్స‌ర్ల వర్షంతో న్యూజిలాండ్‌ ఓపెన‌ర్ విధ్వంసం | Tim-Seifert-Sixers-Sharajah Warriorz-Won-7-Wkts-Vs-Dubai Capitals-ILT20 | Sakshi
Sakshi News home page

ILT20: సిక్స‌ర్ల వర్షంతో న్యూజిలాండ్‌ ఓపెన‌ర్ విధ్వంసం

Nov 28 2026 2:12 PM | Updated on Nov 28 2026 2:43 PM

Tim-Seifert-Sixers-Sharajah Warriorz-Won-7-Wkts-Vs-Dubai Capitals-ILT20

Photo Credit: Twitter

ఇంట‌ర్నేష‌న‌ల్ లీగ్ టీ20 (ఐఎల్‌టీ20)లో న్యూజిలాండ్ ఓపెన‌ర్ టిమ్ సీఫెర్ట్ విధ్వంసం సృష్టించాడు. ఫ‌లితంగా షార్జా వారియ‌ర్స్ 13 ఓవ‌ర్ల‌లోనే మూడు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించి విజ‌యాన్ని అందుకుంది. విష‌యంలోకి వెళితే షార్జా వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిట‌ల్స్‌పై 7 వికెట్ల తేడాతో షార్జా వారియ‌ర్స్ గెలుపొందింది.

20 బంతుల్లో 41 ప‌రుగులు చేసిన సీఫెర్ట్ ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్ స‌హా ఐదు భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. సీఫెర్ట్‌కు తోడుగా మ‌రో ఓపెన‌ర్ పాల్ వాల్ట‌ర్ (25 బంతుల్లో 42) కూడా ధాటిగా ఆడాడు. వీరిద్ద‌రు ఔటైన త‌ర్వాత చివర్లో బ్రెండన్ మెక్‌ముల‌న్ (26 నాటౌట్) జ‌ట్టును గెలిపించాడు. దుబాయ్ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా, ముహ‌మ్మ‌ద్ అర్ఫాన్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. 

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిట‌ల్స్ 19.4 ఓవ‌ర్ల‌లో 126 ప‌రుగుల‌కు ఆలౌటైంది. క‌రీమ్ జ‌న‌త్ (18 బంతుల్లో 30) టాప్ స్కోర‌ర్ కాగా, మార్క‌స్ స్టోయినిస్ (23) ప‌ర్వాలేద‌నిపించాడు. షార్జా వారియ‌ర్స్ బౌల‌ర్ల‌లో జునైద్ సిద్దిఖీ మూడు వికెట్లు తీయ‌గా, రిచ‌ర్డ్ గ్లెసెన్‌, ఆడ‌మ్ మిల్నే రెండు వికెట్లు తీశాడు. 

ఈ సీజ‌న్‌లో తొలి విజ‌యాన్ని న‌మోదు చేసిన షార్జా వారియ‌ర్స్  మూడు మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, రెండు ఓట‌ముల‌తో ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉండ‌గా, దుబాయ్ క్యాపిట‌ల్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండో ఓట‌మితో ఐదో స్థానంలో కొన‌సాగుతుంది.

ఇదీ చదవండి: డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ స్టార్ క‌న్నుమూత‌.. షాకింగ్ విష‌యాలు వెలుగులోకి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement