Photo Credit: BCCI Twitter
టీమిండియా బౌలర్ ఆకాశ్ దీప్ న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించాడు. క్రైస్ట్‌చర్చి వేదికగా కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆకాశ్ దీప్ ఐదు వికెట్లతో మెరిసిన సంగతి తెలిసిందే. 31.3 ఓవర్లు బౌలింగ్ వేసిన ఆకాశ్ దీప్ 99 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా క్రైస్ట్‌చర్చిలోని హెగ్లీ ఓవల్ వేదికలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.
అయితే భారత ఫీల్డర్లు పలు క్యాచ్‌లు జారవిడవడంతో ఆకాశ్ దీప్ మరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకునే అవకాశం కోల్పోయాడు. ఈ సంగతి పక్కనబెడితే, గతంలో టీమిండియా పేసర్లు జవగల్ శ్రీనాథ్, జహీర్‌ఖాన్, ఇషాంత్ శర్మ న్యూజిలాండ్ గడ్డపై ఐదు వికెట్ల హాల్ నమోదు చేసినప్పటికీ, క్రైస్ట్‌చర్చి వేదికలో మాత్రం ఎవరూ ఐదు వికెట్ల హాల్ నమోదు చేయలేదు.

PC: Twitter
ఈ నేపథ్యంలోనే హెగ్లీ ఓవల్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా ఆకాశ్ దీప్ నిలిచాడు. గతంలో ఇదే వేదికలో షమీ గణాంకాలు (4/81) అత్యుత్తమంగా ఉన్నాయి. తాజాగా ఆకాశ్‌దీప్ ఐదు వికెట్లతో దానిని సవరించాడు.
హెగ్లీ ఓవల్‌లో భారత బౌలర్ల గణాంకాలు..
ఆకాష్ దీప్ - 5/99
మహమ్మద్ షమీ - 4/81
జస్ప్రీత్ బుమ్రా - 3/62
రవీంద్ర జడేజా -2/22
గుర్నూర్ బ్రార్ - 2/78
కివీస్ గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్లు
జహీర్ ఖాన్ – 4
ప్రసన్న – 3
ఇషాంత్ శర్మ – 3
హర్భజన్ సింగ్ – 1
బిషన్ సింగ్ బేడి – 1
రవి శాస్త్రి – 1
జవగల్ శ్రీనాథ్ – 1
రాజిందర్ నాథ్ నాడ్కర్ని – 1
బిఎస్ చంద్రశేఖర్ – 1
ఆకాష్ దీప్ – 1
👉ఆకాశ్‌దీప్‌కు టెస్టుల్లో ఇది రెండో ఐదు వికెట్ల హాల్. 2024లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో (6/99)తో అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. ఓవరాల్‌గా ఆకాశ్ దీప్ 12 టెస్టుల్లో 36 వికెట్లు పడగొట్టాడు.
FIFER. FINALLY. 🔥 Akash Deep finally gets his fifth as New Zealand are bowled out for 356! Watch the HERO VIDA India Tour of New Zealand 2nd Test, Day 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #NZvIND https://t.co/ySzJp6RkHH
— Sony Sports Network (@SonySportsNetwk) November 28, 2026
ఇదీ చదవండి: సూపర్‌మేన్ తరహాలో డైవ్.. ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్


