కళ్లు చెదిరే క్యాచ్‌.. షాక్‌లో ఉండిపోయిన కివీస్‌ డేంజరస్‌ బ్యాటర్‌! | Dhruv Jurel Acrobatic Catch Dismisses Daryl Mitchell As Washington Sundar Gives India A Much Needed Breakthrough In 2nd Test, Watch Video Viral | Sakshi
Sakshi News home page

కళ్లు చెదిరే క్యాచ్‌.. షాక్‌లో ఉండిపోయిన కివీస్‌ డేంజరస్‌ బ్యాటర్‌!

Nov 27 2026 12:40 PM | Updated on Nov 27 2026 1:00 PM

Dhruv Jurel Stunning Catch-Shocks-Daryl Mitchell-NZ Vs IND 2nd Test

Photo Credit: Twitter

క్రైస్ట్‌చ‌ర్చి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ప్లేయ‌ర్ ధ్రువ్ జురెల్ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. తొలి టెస్టును కివీస్ డ్రా చేసుకోవ‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను ఎలాంటి త‌ప్పు చేయ‌కుండా ఒడిసి ప‌ట్టిన జురెల్ భార‌త్‌కు బ్రేక్ ఇచ్చాడు. 

ఇన్నింగ్స్ 65వ ఓవ‌ర్లో సుంద‌ర్ నాలుగో బంతిని లెగ్ స్టంప్ దిశ‌గా వేశాడు. అయితే బంతి కాస్త బౌన్స్ కావ‌డంతో డారిల్ మిచెల్ బ్యాట్‌ను తాకి లెగ్ స్లిప్ వైపు వెళ్లింది. అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న ధ్రువ్ జురెల్ త‌న ఎడ‌మ‌వైపు డైవ్ చేసి బంతిని రెండు చేతుల‌తో అందుకున్నాడు. ఈ స‌మ‌యంలో జురెల్ త‌న శ‌రీరాన్ని విల్లులా వొంచి క్యాచ్ అందుకోవ‌డం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దీంతో మిచెల్ ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డిన‌ట్ల‌యింది.

అప్ప‌టికే 74 బంతుల్లో 31 ప‌రుగుల‌తో క్రీజులో పాతుకుపోయిన మిచెల్ ఔట‌వ్వ‌డం భార‌త్‌కు పెద్ద ఊర‌ట‌. ఎందుకంటే డారిల్ మిచెల్ భార‌త్‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారిపోయాడు. తొలి టెస్టును న్యూజిలాండ్ డ్రా చేసుకోవ‌డానికి డారిల్ మిచెల్ ప్ర‌ధాన కార‌ణం. గ్లెన్ ఫిలిప్స్‌తో క‌లిసి దాదాపు 49 ఓవ‌ర్ల పాటు బ్యాటింగ్ చేసి భార‌త్ విజ‌యానికి సైంధువుడిలా అడ్డుప‌డ్డాడు. 

రెండో టెస్టులో కూడా 131 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన కివీస్‌ను టామ్ బ్లండెల్‌తో క‌లిసి డారిల్ మిచెల్ ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే సుంద‌ర్ తెలివైన బంతితో మిచెల్‌ను బురిడీ కొట్టించి టీమిండియాకు ఊర‌ట క‌లిగించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండో టెస్టులో భాగంగా తొలి రోజు ఆట ముగిసింది. డే-1 స్టంప్స్ సమయానికి టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. టామ్ బ్లండెల్ (53) అజేయ అర్థశతకం సాధించగా, గ్లెన్ ఫిలిప్స్ (36) క్రీజులో ఉన్నారు. 

అంతకముందు కెప్టెన్ టామ్ లాథమ్ (59) అర్థసెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్‌, వాషిం‍గ్టన్ సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇదీ చదవండి: NZ Vs IND: తొలిరోజు ముగిసిన ఆట.. బుమ్రా ఖాతాలో చెత్త రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement