సిరాజ్‌కు ద‌క్క‌ని చోటు.. ఆరేళ్ల‌లో ఇదే తొలిసారి! | Mohammed Siraj Misses-First Full Away Test Series-6-Year Streak Comes-End | Sakshi
Sakshi News home page

సిరాజ్‌కు ద‌క్క‌ని చోటు.. ఆరేళ్ల‌లో ఇదే తొలిసారి!

Nov 27 2026 10:42 AM | Updated on Nov 27 2026 11:06 AM

Mohammed Siraj Misses-First Full Away Test Series-6-Year Streak Comes-End

Photo Credit: Twitter

న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తుది జట్టులోనూ భారత సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. వెల్లింగ్టన్ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత సిరాజ్‌ను పక్కనబెట్టడంపై విస్తృత​ చర్చ జరుగుతోంది. రెండో టెస్టులోనైనా అతడిని ఆడిస్తారని అంతా భావించినప్పటికీ, మరోసారి సిరాజ్ బెంచ్‌కు పరిమితం కావడంతో కెరీర్ ముగిసినట్లేనన్న అభిప్రాయానికి వస్తున్నారు. 

ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ సిరాజ్ కావడం గమనార్హం. ఆరేళ్ల క్రితం టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుండి, ఒక సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా సిరాజ్ బెంచ్‌కే పరిమితం కావడం ఇదే మొదటిసారి.

క‌న్నీళ్లు పెట్టుకున్నాడా?: ముర‌ళీ కార్తిక్‌
ఈ నేప‌థ్యంలో సిరాజ్‌ను ఆడించ‌క‌పోవ‌డంపై మాజీ క్రికెట‌ర్ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సిరాజ్‌ను పక్కన పెట్టడంపై భారత మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టాస్ అనంతరం మైదానంలో కళ్లద్దాలు పెట్టుకుని నడుస్తున్న సిరాజ్‌ను చూసి, తుది జట్టులో చోటు దక్కలేదన్న బాధతో అతను కన్నీళ్లు పెట్టుకున్నాడంటూ కార్తిక్ తెలిపాడు. 

ఇదేం విడ్డూరం: మ‌హ్మ‌ద్ కైఫ్‌
సిరాజ్‌ను వరుసగా రెండో టెస్టుకు దూరం పెట్టడంపై మాజీ క్రికెట‌ర్‌ మహ్మద్ కైఫ్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. కైఫ్ మాట్లాడుతూ.. ‘‘భార‌త ప్రీమియ‌ర్‌ ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన మహ్మద్ సిరాజ్‌ను  ఆడించ‌క‌పోవ‌డం నమ్మశక్యంగా అనిపించ‌డంలేదు. విదేశీ టెస్ట్ బౌలింగ్ విభాగంలో బుమ్రాతో పాటు మొదటగా పరిగణించాల్సింది సిరాజ్‌నే. 

కానీ ఇక్క‌డ‌ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వయంగా సిరాజ్‌ను వరల్డ్ క్లాస్ బౌలర్ అని, బాగా బౌలింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు. మ‌రి అలాంటి బౌలర్‌ను ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కావడం లేదు’’ అంటూ  జ‌ట్టు మేనేజ్‌మెంట్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశాడు.

ఇది చాలా అన్యాయం: హర్షా బోగ్లే
సిరాజ్‌ను ప‌క్క‌న‌బెట్ట‌డంపై ప్ర‌ఖ్యాత కామెంటేట‌ర్ హ‌ర్షా బోగ్లే సైతం జ‌ట్టు మేనేజ్‌మెంట్‌పై విరుచుకుప‌డ్డాడు. ‘‘సిరాజ్ ఇప్పుడు భారత్లో 6వ ర్యాంక్ ఫాస్ట్ బౌలర్ అయిపోయాడు. ఇది నాకు చాలా అన్యాయంగా అనిపిస్తోంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) సైకిల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లలో టీమిండియా నుంచి బుమ్రాకు మాత్రమే జట్టులో చోటు దక్కింది. 

ఎంపికైన బౌలర్లు బాగా రాణించాలని కోరుకుందాం. వారికి బౌలింగ్ చేయడానికి అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ తమ వంతు వచ్చినప్పుడు కూడా ఎక్కువ అవకాశాలు దక్కవనే విషయం వారికి అర్థమవుతుంది’’ అంటూ సెలక్షన్ విధానాన్ని ఎండ‌గ‌ట్టాడు.

ఇదీ చదవండి: NZ Vs IND: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్‌

శీతల్ దేవికి హ్యుందాయ్ అదిరిపోయే గిఫ్ట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement