NZ Vs IND: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ | Tom Latham Makes History, Surpasses Kane Williamson To Become New Zealand Highest WTC Run Scorer, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

NZ Vs IND: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌

Nov 27 2026 9:05 AM | Updated on Nov 27 2026 9:42 AM

Tom Latham History Breaks Kane Williamson Record-Most WTC Runs-For NZ

Photo Credit: Twitter

క్రైస్ట్‌చర్చి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ చరిత్ర సృష్టించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టామ్ లాథమ్‌, డెవాన్ కాన్వే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. 

కాన్వే ఔటైనప్పటికీ, టామ్ లాథమ్ అర్థసెంచరీతో మెరిశాడు. మ్యాచ్‌లో 128 బంతులాడిన లాథమ్ 6 ఫోర్ల సాయంతో 59 పరుగులు చేసి ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కివీస్ కెప్టెన్ తన పేరిట పలు రికార్డులు లిఖించుకున్నాడు.

👉వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టామ్ లాథమ్ నిలిచాడు. మ్యాచ్‌లో 59 పరుగులు చేసిన టామ్ లాథమ్ (3037 పరుగులు) కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3025 పరుగులు)ను అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. ఇక డారిల్ మిచెల్ (2,177 పరుగులు) మూడో స్థానంలో ఉండగా, డెవాన్ కాన్వే (2,166 పరుగులు), టామ్ బ్లండెల్ (1877 పరుగులు) నాలుగు, ఐదు స్థౠనాల్లో ఉన్నారు.

👉ఇక భారత్‌తో టెస్టుల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక ఫిఫ్టీలు చేసిన క్రికెటర్ల జాబితాలో టామ్ లాథమ్ తొలి స్థానానికి చేరుకున్నాడు. 9 అర్థసెంచరీలు సాధించిన టామ్ లాథమ్‌.. బెవన్ సుట్‌క్లిఫ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా, ఏడు అర్థశతకాలతో కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. మార్క్ బర్గ్స్‌, బ్రెండన్ మెక్‌కల్లమ్‌, క్రెయిగ్ మెక్‌మిలన్‌, జాన్ రైట్‌లు ఆరేసి అర్థశతకాలు సాధించారు.

👉టెస్టుల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టామ్ లాథమ్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ కివీస్ కెప్టెన్‌  174 ఇన్నింగ్స్‌ల్లో 6,479 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో బ్రెండన్ మెక్‌కల్లమ్ (176 ఇన్నింగ్స్‌ల్లో 6,453 పరుగులు)ను అధిగమించాడు.

👉ఇక భారత్‌తో టెస్టుల్లో ఓపెనింగ్ భాగస్వామ్యంలోనూ టామ్ లాథమ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టామ్ లాథమ్‌, డెవాన్ కాన్వే జోడీ ఈ మ్యాచ్‌లో 77 పరుగులు జోడించారు. గతంలో టామ్ లాథమ్, టామ్ బ్లండెల్ కలిసి 2020లో వరుసగా రెండు టెస్టుల్లో 66, 103 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పారు.

👉మ్యాచ్ విషయానికొస్తే, టీ విరామ అనంతరం న్యూజిలాండ్ 57 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (10), టామ్ బ్లండెల్ (12) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా, అన్షజ‌ల్ కాంబోజ్‌, గుర్నూర్‌బ్రార్‌లు చెరొక వికెట్ పడగొట్టారు.

ఇదీ చదవండి: 'చిన్న పొర‌పాటుతో భారీ మూల్యం చెల్లించుకున్నాం' 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement