Photo Credit: BCCI X
క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ల కోసం శ్రమిస్తుంది. కివీస్ ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్ అజేయ అర్థసెంచరీతో మెరవగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (31) పర్వాలేదనిపించాడు. ఫలితంగా న్యూజిలాండ్ 39 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ తీశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. లంచ్ విరామ సమయానికి ముందు కాన్వే ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో గుర్నూర్ బ్రార్ తొలి టెస్టు వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Photo Credit: BCCI X
మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తరఫున గుర్నూర్ బ్రార్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బుమ్రా చేతుల మీదుగా గుర్నూర్ క్యాప్‌ను అందుకున్నాడు. ప్రసిధ్ క్రిష్ణ స్థానంలో గుర్నూర్ జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. ఇక తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని, తొలి టెస్టు ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తెలిపాడు.
భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభమన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, కైల్ జామీసన్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ
Test Cap No. 321 Gurnoor Brar is all set to make his debut in whites for #TeamIndia He gets his Test cap from @Jaspritbumrah93 🤝 #NZvIND https://t.co/9AIeizgFm8
— BCCI (@BCCI) November 26, 2026
A BEAUTIFUL SPEECH BY JASPRIT BUMRAH 🥹🤍 - Bumrah talks about the value of Test Cap and giving to debutant Gurnoor. https://t.co/bbwo5HR1Oj
— Johns. (@CricCrazyJohns) November 27, 2026
ఇదీ చదవండి: Ind vs Nz 2nd Test: గుర్నూర్ అరంగేట్రం


