భారత్‌తో సెమీస్‌.. లంక ఓపెనర్‌ సుడిగాలి శతకం | ACC Mens Asia Cup Rising Stars 2026 1st semi final IND A VS SL A: Sineth jayawardena slams 62 ball hundred, sri lanka rushing towards target | Sakshi
Sakshi News home page

భారత్‌తో సెమీస్‌.. లంక ఓపెనర్‌ సుడిగాలి శతకం

Nov 26 2026 9:13 PM | Updated on Nov 26 2026 9:13 PM

ACC Mens Asia Cup Rising Stars 2026 1st semi final IND A VS SL A: Sineth jayawardena slams 62 ball hundred, sri lanka rushing towards target

source: X

ఇవాళ జరుగుతున్న ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీ తొలి సెమీఫైనల్లో భారత్‌, శ్రీలంక-ఎ జట్లు పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది.

ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (78), కెప్టెన్‌ తిలక్‌ వర్మ (53), మిడిలార్డర్‌ బ్యాటర్‌ షాబాజ్‌ అహ్మద్‌ (54 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించగా.. చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (40) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. 

మిగతా ప్లేయర్లలో కుమార్‌ కుషాగ్రా 21, రింకూ సింగ్‌ 12, సూర్యాంశ్‌ షేడ్గే 10, తనుశ్‌ కోటియన్‌ 28, హర్ష్‌ దూబే 8 (నాటౌట్‌) పరుగులు చేశారు. లంక బౌలర్లలో రవిందు ఫెర్నాండో, జనిత్‌ లియనాగే, నిపున్‌ ధనుంజయ తలో 2 వికెట్లు పడగొట్టగా.. గరుక సంకేత్‌, లహీరు సమరకూన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

318 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక, భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ లక్ష్యం దిశగా సాగుతోంది. సినెత్‌ జయవర్దెనా (100), లసిత్‌ క్రూస్‌పుల్లే (52 బంతుల్లో 59; 7 ఫోర్లు, సిక్సర్‌) ధాటిగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించేస్తున్నారు. 

ముఖ్యంగా జయవర్దెనా భారత బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. కేవలం 62 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. క్రూస్‌పుల్లే కూడా ధాటిగానే ఆడుతున్నాడు. వీరి ధాటికి శ్రీలంక 19 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 165 పరుగులు చేసింది. ఆ జట్టు మరో 31 ఓవర్లలో 153 పరుగులు చేస్తే విజయతీరాలు చేరుకుంటుంది.

ఇదీ చదవండి: నిప్పులు చెరిగిన షాహీన్‌ అఫ్రిది.. 43 పరుగులకే 7 వికెట్లు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement