source: X
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భాగంగా ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక-ఎ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
గత మ్యాచ్ తరహానే రెచ్చిపోతున్న వైభవ్
టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గత మ్యాచ్ తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ రెచ్చిపోతున్నాడు. కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 21 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా అభిషేక్ శర్మ (6) క్రీజ్‌లో ఉన్నాడు. 4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 34-0గా ఉంది.
తుది జట్లు
శ్రీలంక-ఎ: లసిత్ క్రూస్‌పుల్లే, సినెత్ జయవర్దన, నిషాన్ మదుష్క(w), పవన్ రత్నాకే(c), నిపున్ ధనంజయ, జనిత్ లియానగే, వనుజా సహన్, విజయకాంత్ వియస్కాంత్, రవిందు ఫెర్నాండో, లహిరు సమరకోన్, గరుక సంకేత్
ఇండియా-ఎ: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ(సి), కుమార్ కుషాగ్రా(w), రింకు సింగ్, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, తనుష్ కొటియన్, హర్ష్ దూబే, హర్షిత్ రాణా, అర్షద్ ఖాన్
ఇదీ చదవండి: కృనాల్ పాండ్యాపై బూట్లు విసిరిన ప్రేక్షకుడు


