కృనాల్ పాండ్యాపై బూట్లు విసిరిన ప్రేక్షకుడు | Krunal Pandya Narrowly Escapes Being Hit By Shoes In SMAT 2026 | Sakshi
Sakshi News home page

కృనాల్ పాండ్యాపై బూట్లు విసిరిన ప్రేక్షకుడు

Nov 26 2026 3:09 PM | Updated on Nov 26 2026 3:09 PM

Krunal Pandya Narrowly Escapes Being Hit By Shoes In SMAT 2026

source: X

భారత క్రికెటర్‌, బరోడా కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యాకు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2026లో చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత స్టాండ్స్‌లో ఉన్న అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా ఓ ప్రేక్షకుడు అతడిపైకి బూట్లు విసిరాడు. 

అయితే కృనాల్‌ ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. బూట్లు విసిరిన వ్యక్తికి వేలు చూపిస్తూ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతుంది. బరోడా, జార్ఖండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.

బరోడా జోరు
కృనాల్‌ నాయకత్వంలోని బరోడా జట్టు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2026లో అద్భుతంగా రాణిస్తోంది. జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టోర్నీలో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన బరోడా ఐదు విజయాలు సాధించి, ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది

బరోడా విజయాల్లో కృనాల్‌ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో 12.27 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. మధ్య ఓవర్లలో పరుగులను నియంత్రిస్తూ, జట్టు విజయాలకు బాటలు వేస్తున్నాడు.

బ్యాటింగ్‌ చేసే అవకాశం ఎక్కువగా రాకపోయినా, అవసరమైనప్పుడు తన వంతు సహకారం అందిస్తున్నాడు. జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగులు చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.

కృనాల్‌ ఇటీవల జరిగిన హాంగ్‌కాంగ్‌ సిక్సస్‌ టోర్నీలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. 12 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో 11వ స్థానంతో సరిపెట్టుకుంది. గ్రూప్‌ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. 

ఇదీ చదవండి: 32 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించిన మాజీ కెప్టెన్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement