ఆంధ్ర బ్యాట‌ర్ సిక్స‌ర్ల వ‌ర్షం.. అస్సాంపై ఘ‌న విజ‌యం | Andhra Batter-Hemanth-Stroms-25-Balls-64 Runs-Victory Vs Assam | Sakshi
Sakshi News home page

SMAT 2026: ఆంధ్ర బ్యాట‌ర్ సిక్స‌ర్ల వ‌ర్షం.. అస్సాంపై ఘ‌న విజ‌యం

Nov 22 2026 10:18 PM | Updated on Nov 22 2026 10:20 PM

Andhra Batter-Hemanth-Stroms-25-Balls-64 Runs-Victory Vs Assam

Photo Credit: Twitter

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూప్‌-సిలో అస్సాంతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జ‌ట్టు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 135 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆంధ్ర జ‌ట్టు 11.4 ఓవ‌ర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెన‌ర్ మారంరెడ్డి హేమంత్ రెడ్డి (25 బంతుల్లో 64; 6 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. 

అత‌డికి తోడు షేక్ ర‌షీద్ (31 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌), వికెట్ కీప‌ర్ ఎస్‌డీఎన్‌వీ ప్ర‌సాద్ (13 బంతుల్లో 27) రాణించ‌డంతో ఆంధ్ర టార్గెట్‌ను సులువుగా చేరుకుంది. అస్సాం బౌల‌ర్ జితుమోని క‌లితా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 134 ప‌రుగులు చేసింది. 

సిబ్‌సంక‌ర్ రాయ్ (38) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, సాహిల్ జైన్ (31 నాటౌట్‌) ప‌ర్వాలేద‌నిపించాడు. ఆంధ్ర బౌల‌ర్ల‌లో కేఎస్ న‌ర‌సింహ‌రాజు, స‌త్య‌రనారాయ‌ణ రాజు, కేవీ శ‌శికాంత్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అర్థ‌సెంచ‌రీతో రాణించిన హేమంత్ రెడ్డి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుకచుకున్నాడు.

ఇదీ చదవండి: IND Vs PAK: రెచ్చిపోయిన అభిషేక్ శర్మ.. ఒకే ఓవర్లో 24 పరుగులు

వైభ‌వ్‌ను కంట్రోల్ చేసిన అభిషేక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement