రెచ్చిపోయిన అభిషేక్ శర్మ.. ఒకే ఓవర్లో 24 పరుగులు | Abhishek-Power Hitting-42 balls-70 Runs Vs PAKA-Rising Stars-Asia Cup | Sakshi
Sakshi News home page

IND Vs PAK: రెచ్చిపోయిన అభిషేక్ శర్మ.. ఒకే ఓవర్లో 24 పరుగులు

Nov 22 2026 9:42 PM | Updated on Nov 22 2026 9:47 PM

Abhishek-Power Hitting-42 balls-70 Runs Vs PAKA-Rising Stars-Asia Cup

Photo Credit: BCCI Twitter

ఏసీసీ మెన్స్ ఆసియా క‌ప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ విధ్వంసం సృష్టించాడు. 41 బంతుల్లో 70 ప‌రుగులు చేసిన అభిషేక్ శ‌ర్మ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్స‌ర్లు ఉన్నాయి. అంత‌క‌ముందు 31 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన అభిషేక్ తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఇక మొహ‌మ్మ‌ద్ ఇమ్రాన్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవ‌ర్లో అభిషేక్ విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. 

ఆ ఓవ‌ర్‌లో 0,4,4,6,6,4 బాది మొత్తంగా 24 ప‌రుగులు పిండుకున్నాడు. అంతకముందే వైభవ్‌ సూర్యవంశీతో పాక్‌ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే వైభవ్‌ను కంట్రోల్‌ చేసిన అభిషేక్‌ ఆ తర్వాత బ్యాట్‌తో పాక్‌ బౌలింగ్‌ను ఉతికారేశాడు.

అభిషేక్ ఔట‌య్యే స‌మ‌యానికి భార‌త్ స్కోరు 93 ఉంటే అందులో అత‌డి స్కోరు 70 ఉండ‌డం విశేషం. 314 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే వైభ‌వ్ రూపంలో షాక్ త‌గిలింది. ఆ త‌ర్వాత అభిషేక్, తిల‌క్ వ‌ర్మ క‌లిసి ఇన్నింగ్స్‌ను న‌డిపించారు. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భార‌త్ 102 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇదీ చదవండి: IND-A vs PAK-A: వైభ‌వ్‌ను కంట్రోల్ చేసిన అభిషేక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement