Photo Credit: BCCI Twitter
రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పోరులో మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వివాదం చెలరేగింది. మ్యాచ్ రిఫరీ తప్పిదం వల్ల టాస్ సమయంలో గందరగోళం నెలకొంది. విషయంలోకి వెళితే.. భారత కెప్టెన్ తిలక్ వర్మ కాయిన్ ఎగురవేయగా, పాకిస్తాన్ కెప్టెన్ అబ్దుల్ సమద్ ‘హెడ్’ అని కాల్ ఇచ్చాడు.
అయితే నాణెం నేలపై పడగానే మ్యాచ్ రిఫరీ నియాముర్ రషీద్ పొరపాటున ‘టెయిల్స్’ అని కాల్ ఇచ్చాడు. దీంతో భారత్ టాస్ గెలిచినందని ప్రకటించాడు. అయితే ఇరుజట్ల కెప్టెన్లు కిందకు వంగి నాణేన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పాక్ కెప్టెన్ అబ్దుల్ సమద్ ‘అది హెడ్స్.. హెడ్స్’ అని మైక్‌లో గట్టిగా అరిచాడు. రిఫరీ మరోసారి పరిశీలించి చూడగా, నాణెంపై బొమ్మ కనిపించింది. వెంటనే రిఫరీ తన తప్పును సరిదిద్దుకొని పాకిస్తాన్-ఏ జట్టు టాస్ గెలిచినట్లు ప్రకటించారు.
సాధారణంగానే భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే హైవోల్టేజ్‌లా ఉంటుంది. ఇలాంటి చిన్న సంఘటనలను కూడా రెండు దేశాల అభిమానులు భూతద్ధంలో వెతికి మరీ ట్రోల్ చేస్తుంటారు. కాయిన్‌ను గుర్తించడంలో రిఫరీ పొరపాటు ఉండొచ్చు.. కానీ అంతమాత్రానికే ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా పాక్ కెప్టెన్ మైక్‌లో గట్టిగట్టిగా అరుస్తూ రాద్ధాంతం చేయాలా అంటూ అభిమానులు కామెంట్లు చేశారు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. 36 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. హసన్ నవాజ్ (73), ఫర్హాన్ యూసఫ్ (20) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ఆయుశ్ బదోని, సూర్యాన్ష్ షెడ్గే తలా ఒక వికెట్ పడగొట్టారు.
Toss controversy in rising star Asia Cup. https://t.co/BmhFlo7VJd
— CricInformer (@CricInformer) November 22, 2026
ఇదీ చదవండి: IND Vs PAK: భారత బౌలర్, పాక్ బ్యాటర్ మధ్య మాటల యుద్ధం


