Photo Credit: Twitter
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఏ చిన్న గొడవ జరిగినా అది రెండు దేశాల మధ్య తీవ్రతను తెలియచేస్తుంది. అది ఏ మ్యాచ్ అయినా కానీ, ఇరుజట్ల ఆటగాళ్ల భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. తాజాగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలోనూ భారత్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భావోద్వేగాలు శ్రుతి మించాయి.
మ్యాచ్‌లో భారత పేసర్ హర్షిత్ రానా, పాకిస్తాన్ బ్యాటర్ల మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. బంతితో పాక్ పని పడుతూనే తన దూకుడైన ప్రవర్తనతోనూ హర్షిత్ రాణా ప్రత్యర్థి బ్యాటర్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్షిత్ రాణా వేసిన తొలి బంతి స్లోవర్ డెలివరీగా వచ్చి సదాఖత్‌ను ఇబ్బంది పెట్టింది.
ఆ బంతిని ఎదుర్కొనే క్రమంలో సదాఖత్ ఆడిన షాట్ విఫలమైంది. దీంతో బ్యాటర్‌ను దాటుకుంటూ వెళ్లిన హర్షిత్ రాణా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా షమిల్ హుస్సేన్‌పై బౌలింగ్ చేస్తూ కూడా తన దూకుడును కొనసాగించాడు. ఐదో బంతికి షమిల్ ఆడిన షాట్‌కు ఫైన్ ఎడ్జ్ తగిలినా, బంతి వికెట్ కీపర్‌కు అందకుండా కింద పడింది. ఈ సమయంలోనూ హర్షిత్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
హర్షిత్ రాణా తన బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించగా, సదాఖత్ కూడా క్రీజులో నిలబడేందుకు పోరాడాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం భారత్-ఏ, పాకిస్థాన్-ఏ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మ్యాచ్ విషయానికొస్తే, 19 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్-ఏ జట్టు మూడు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. మాజ్ సదాఖత్ (63 బంతుల్లో 59) అర్థసెంచరీ సాధించగా, షమిల్ హుస్సేన్ (33) పర్వాలేదనిపించాడు. హసన్ నవాజ్ (27).క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా, ఆయుశ్ బదోని, సూర్యాన్ష్ షెడ్గే తలా ఒక వికెట్ పడగొట్టారు.
India vs Pakistan matches always bring unexpected drama! Harshit Rana is making headlines with his on-field aggression, and the tension is clearly rising! 🔥 @grok But what exactly happened? #INDAvPAKA https://t.co/aybWR8BDS7
— Rajnesh Yadav (@CricN1) November 22, 2026
All that fire, all that aggression, and now a wicket to show for it for Harshit Rana. 🥵 Watch India A vs Pakistan A in the #DPWorldAsiaCupRisingStarsMens2026 LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #INDvPAK https://t.co/mhA1AH4YVE
— Sony Sports Network (@SonySportsNetwk) November 22, 2026
ఇదీ చదవండి: SMAT 2026: రెండు రనౌట్లు.. ఆట మొత్తం తారుమారు


