source: X
భారత క్రికెట్‌లో 3D ప్లేయర్‌గా గుర్తింపు ఉన్న విజయ్ శంకర్ ఓ విదేశీ లీగ్‌లో రెచ్చిపోయాడు. ఇటాలియా టీ10 లీగ్‌లో వెనిస్ లైవ్‌వైర్స్ తరఫున ఆడుతున్న అతడు.. మిలన్ ఐకాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.
77 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 20 బంతుల్లోనే అజేయమైన 34 పరుగులు చేసి తన జట్టుకు విజయాన్నందించాడు (8.5 ఓవర్లలోనే). ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ అవార్డును అతడు బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ నుంచి అందుకోవడం విశేషం.
VIJAY SHANKAR: POTM AWARD IN ITALIA T10 🔥 - He smashed 34*(20) while chasing 77 runs for Venice Livewires. Award was given by MSK Prasad. https://t.co/DjL2jAQvRH
— Johns. (@CricCrazyJohns) November 22, 2026
ఎంఎస్‌కే ప్రసాద్ వెనిస్ జట్టుకు టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతనే విజయ్ శంకర్‌ను 2019 వన్డే ప్రపంచకప్‌కు ముందు ‘త్రీ డైమెన్షనల్’ ఆటగాడిగా అభివర్ణించాడు. అందుకే వీరిద్దరి కలయికతో ఉన్న ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ ఫోటోను శంకర్ సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ ‘4D అన్‌లాక్‌డ్’ అనే ఫన్నీ క్యాప్షన్ జతచేశాడు. ఇది నెటిజన్లను మరింతగా ఆకర్షిస్తోంది.
కాగా, విజయ్ శంకర్ భారత దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌కు 2026 మేలో వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి అతడు విదేశీ టీ10, టీ20 లీగ్‌లలో ఆడుతున్నాడు
లంక ప్లేయర్ స్థానంలో..!
విజయ్ శంకర్ వెనిస్ లైవ్‌వైర్స్ జట్టులోకి ఇటీవలే చేరాడు. శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్స స్థానంలో అతడు జట్టులోకి వచ్చాడు. డేవిడ్ మలాన్ కెప్టెన్సీలోని ఈ జట్టులో క్రిస్ గేల్, జేజే స్మట్స్, కేఆర్ కరియప్ప వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.
ఇదీ చదవండి: జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన రికార్డు


