టీమిండియా ప్లేయర్ కళ్లు చెదిరే క్యాచ్‌.. ఒంటి చేత్తో! వీడియో వైరల్‌ | Dhruv Jurel Goes Airborne To Pull Off One-Handed Screamer | Sakshi
Sakshi News home page

IND vs NZ: టీమిండియా ప్లేయర్ కళ్లు చెదిరే క్యాచ్‌.. ఒంటి చేత్తో! వీడియో వైరల్‌

Nov 22 2026 10:58 AM | Updated on Nov 22 2026 11:08 AM

Dhruv Jurel Goes Airborne To Pull Off One-Handed Screamer

PC: BCCI/X

బేసిన్ రిజర్వ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత‌మైన ఫీల్డింగ్ విన్యాసం క‌న‌బ‌రిచాడు. జురెల్ సంచ‌ల‌న క్యాచ్‌తో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో హెన్రీ నికోల్స్ (31)ను పెవిలియన్‌కు పంపాడు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్ 22వ ఓవ‌ర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ.. తొలి బంతిని నికోల్స్‌కు మిడిల్ స్టంప్ లైన్‌పై షార్ట్ ఆఫ్ ఎ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. 

ఆ బంతిని నికోల్స్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని థై ప్యాడ్‌కు తగిలి గాల్లోకి లేచింది. షార్ట్ లెగ్‌లో ఉన్న ధ్రువ్  వెంటనే ముందుకు డైవ్ చేస్తూ కుడిచేత్తో అసాధరణ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా నికోల్స్ బిత్తరపోయాడు. సహచర ఆటగాళ్లు జురెల్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

బ్యాట్‌తోనూ జురెల్ మెరుపులు
అంతకుముందు బ్యాటింగ్‌లోనూ ధ్రువ్ జురెల్ తన సత్తా చాటాడు. కేవలం 79 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 78 పరుగులు చేసి జట్టు స్కోరును వేగంగా పరుగులు పెట్టించాడు. జురెల్ మెరుపు ఇన్నింగ్స్ సాయంతో భారత్ 720/9 వద్ద భారీ స్కోరు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్‌(136), రిషబ్ పంత్‌(128) భారీ సెంచరీలతో కదం తొక్కారు.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement