చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ | Rishabh Pant Creates Unique Record, Achieves Rare SENA Milestone | Sakshi
Sakshi News home page

IND vs NZ: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్

Nov 22 2026 9:01 AM | Updated on Nov 22 2026 9:18 AM

Rishabh Pant Creates Unique Record, Achieves Rare SENA Milestone

PC: BCCI/X

టెస్టు క్రికెట్‌లో త‌న తిరుగు లేద‌ని టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ మ‌రోసారి నిరూపించుకున్నాడు. వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పంత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌.. తనదైన శైలిలో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడ్డు.  

బేసిన్ రిజర్వ్ మైదానంలో రిషబ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. వైట్‌బాల్ క్రికెట్ మ్యాచ్‌ను తలిపిస్తూ బ్యాటింగ్ చేసిన పంత్‌.. కేవలం 153 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 128 పరుగులు సాధించిన ఔటయ్యాడు. ఈ తుపాన్ ఇన్నింగ్స్‌తో పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

సేనా(దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలన్నింటిలోనూ స్టు సెంచరీ సాధించిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్, జానీ బెయిర్‌స్టో తర్వాత ఈ ఘనత సాధించిన మూడో వికెట్ కీపర్‌గా పంత్‌ నిలిచాడు.

అదేవిధంగా సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజారుద్దీన్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తర్వాత అన్ని సేనా దేశాల్లో సెంచరీలు చేసిన ఆరో భారత బ్యాటర్‌గా పంత్ నిలిచాడు.

కాగా ఈ మ్యాచ్‌లో పంత్ సిక్సర్‌తో తన 9వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పంత్ ఇలా చేయడం నాలుగోసారి కావడం గమనార్హం. అలాగే టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో బ్రెండన్ మెకల్లమ్‌ను వెన‌క్కి నెట్టి పంత్(108) రెండో స్ధానానికి చేరుకున్నాడు. ఈ లిస్ట్‌లో బెన్ స్టోక్స్‌(138) అగ్ర‌స్ధానంలో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement