జస్ప్రీత్‌ బుమ్రా మరో అరుదైన రికార్డు | Jasprit Bumrah Enters Exclusive India Club With Double First-Over Strikes Vs New Zealand | Sakshi
Sakshi News home page

IND vs NZ: జస్ప్రీత్‌ బుమ్రా మరో అరుదైన రికార్డు

Nov 22 2026 9:29 AM | Updated on Nov 22 2026 9:39 AM

Jasprit Bumrah Enters Exclusive India Club With Double First-Over Strikes Vs New Zealand

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి మొదటి ఓవర్‌లోనే భారత్‌కు శుభారంభం అందించాడు. రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన బుమ్రా.. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపాడు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లోనూ బుమ్రా మొదటి ఓవర్‌లోనే లాథమ్ వికెట్‌ను పడగొట్టడం విశేషం. తద్వారా బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలోనూ తొలి ఓవర్‌లో వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. బుమ్రా కంటే ముందు కేవలం శ్రీశాంత్, జహీర్ ఖాన్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలో తొలి ఓవర్‌లో వికెట్ తీసిన భారత బౌలర్లు

ఎస్. శ్రీశాంత్: వెస్టిండీస్‌పై (కింగ్‌స్టన్, 2006)

జహీర్ ఖాన్: బంగ్లాదేశ్‌పై (మీర్పూర్, 2007)

జస్ప్రీత్ బుమ్రా: న్యూజిలాండ్‌పై (వెల్లింగ్టన్, 2026)

భారత్ భారీ స్కోర్‌
కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 720 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియాకు  352 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. కాగా భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (136), రిషభ్ పంత్ (128) శతకాలతో మెరవగా.. శస్వి జైశ్వాల్‌(85), దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(80), శుబ్‌మన్‌ గిల్‌(98), ధ్రువ్‌ జురెల్‌(78) హాఫ్‌ సెంచరీలతో రాణించారు.
చదవండి: IND vs NZ: టీమిండియా ప్రపంచ రికార్డు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement