ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్, పాకిస్థాన్ ఏ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. దోహా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ భారత బౌలర్లపై విరుచుకుపడుతుంది. ఆ జట్టు ఓపెనర్లు షమిల్ హుసేన్ (33), మాజ్ సదాకత్ (30) దూకుడుగా ఆడుతున్నారు.
దీంతో తొలి 6 ఓవర్లలో పాక్ వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. భారత కెప్టెన్ తిలక్ వర్మ హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్‌తో బౌలింగ్ దాడి ప్రారంభించాడు. అయితే పాక్ ఓపెనర్లు వీరిద్దరిని సమర్దవంతంగా ఎదుర్కొంటున్నారు.
🔴VIPRAJ NIGAM, WHAT WERE YOU TRYING TO DO WITH VAIBHAV SURYAVANSHI? 🤯 - Vaibhav ran to save the ball from going over the boundary. - But Vipraj Nigam dived to stop the ball, and his leg hit Vaibhav's head during the dive. HOPEFULLY, VAIBHAV HASN'T SUFFERED ANY INJURY. 👀 https://t.co/UH8SYnF8IR
— Sam (@cricsam02) November 22, 2026
వైభవ్‌కు పెను ప్రమాదం తప్పింది..!
ఫీల్డింగ్ చేస్తుండగా టీమిండియా బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి పెను ప్రమాదం తప్పింది. బౌండరీని అడ్డుకునే క్రమంలో సహచరుడు విప్రాజ్ నిగమ్‌ను ప్రమాదకరంగా ఢీకొన్నాడు. అయితే అదృష్టవశాత్తు అతడికి ఏమీ కాలేదు.
వైభవ్తొలుత దవడ భాగాన్ని పట్టుకొని చాలా అసౌకర్యంగా కనిపించినా తిరిగి ఫీల్డింగ్‌ను కొనసాగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ భారత బ్యాటింగ్‌కు చాలా కీలకం కానున్నాడు. ఇలాంటి తరుణంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే అది భారత్ విజయావకాశాలను ప్రభావితం చేసుండేది.
టాస్ సమయంలో గందరగోళం
ఈ మ్యాచ్ టాస్ సమయంలో కొంత గందరగోళం చోటుచేసుకుంది. తొలుత టాస్ భారత్ గెలిచినట్లు మ్యాచ్ రిఫరీ భావించినప్పటికీ.. పాక్ కెప్టెన్ అబ్దుల్ సమద్ తాము టాస్ గెలిచామని స్పష్టం చేశాడు.
మరోసారి నో హ్యాండ్‌షేక్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ క్రికెట్ జట్లు ఎప్పుడు ఎదురుపడినా కరచాలనం చేసుకోవట్లేదు. తాజాగా సేమ్ సీన్ రిపీటైంది. టాస్ తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకోలేదు. ఇరువురు కెప్టెన్లు టాస్ సందర్భంగా మాట్లాడిన తర్వాత ఒకరినొకరు చూసుకోకుండా వెళ్లిపోయారు.
తుది జట్లు..
భారత్-ఏ: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, తిలక్ వర్మ(సి), కుమార్ కుషాగ్రా(w), రింకు సింగ్, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్
పాకిస్తాన్-ఏ: షామిల్ హుస్సేన్, మాజ్ సదాకత్, రోహైల్ నజీర్(w), హసన్ నవాజ్, అబ్దుల్ సమద్(c), ఫర్హాన్ యూసఫ్, సాద్ మసూద్, మహ్మద్ ఇమ్రాన్ రంధావా, అహ్మద్ డానియాల్, సుఫ్యాన్ మొకిమ్, అలీ రజా
ఇదీ చదవండి: IND VS PAK: మరోసారి హ్యాండ్‌షేక్ వివాదం


