IND VS PAK: మరోసారి హ్యాండ్‌షేక్‌ వివాదం | No Handshake Again in India A vs Pakistan A Asia Cup Rising Stars Tourney | Sakshi
Sakshi News home page

IND VS PAK: మరోసారి హ్యాండ్‌షేక్‌ వివాదం

Nov 22 2026 4:06 PM | Updated on Nov 22 2026 4:08 PM

No Handshake Again in India A vs Pakistan A Asia Cup Rising Stars Tourney

source: X

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య హ్యాండ్‌షేక్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల క్రికెట్‌ జట్లు ఎప్పుడు ఎదురుపడినా కరచాలనం చేసుకోవట్లేదు. తాజాగా సేమ్‌ సీన్‌ రిపీటైంది.

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో భాగంగా భారత్‌, పాక్‌ జట్లు (ఏ జట్లు) ఇవాళ మరోసారి ఎదురెదురుపడ్డాయి. ఖతార్‌లోని దోహా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు టాస్‌ సమయంలో కరచాలనం చేసుకోలేదు.

ఈ మ్యాచ్‌లో పాక్‌ కెప్టెన్‌ అబ్దుల్‌ సమద్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇరువురు కెప్టెన్లు (భారత కెప్టెన్‌ తిలక్‌ వర్మ) టాస్‌ సందర్భంగా మాట్లాడిన తర్వాత ఒకరినొకరు చూసుకోకుండా వెళ్లిపోయారు.

ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కాగా.. పాకిస్తాన్‌ జట్టు దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తుంది. తొలి 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. 

ఓపెనర్లు షమిల్‌ హుసేన్‌ 33, మాజ్‌ సదాకత్‌ 30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత కెప్టెన్‌ తిలక్‌ వర్మ హర్షిత్‌ రాణా, ప్రిన్స్‌ యాదవ్‌తో బౌలింగ్‌ దాడి ప్రారంభించాడు. అయితే పాక్‌ ఓపెనర్లు వీరిద్దరిని సమర్దవంతంగా ఎదుర్కొంటున్నారు.

కాగా, ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్‌ నేపాల్‌పై ఏకంగా 306 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మరోవైపు పాక్‌ యూఏఈపై 61 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో శుభారంభం చేసింది.

తుది జట్లు..

భారత్‌-ఏ: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, తిలక్ వర్మ(సి), కుమార్ కుషాగ్రా(w), రింకు సింగ్, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్

పాకిస్తాన్‌-ఏ: షామిల్ హుస్సేన్, మాజ్ సదాకత్, రోహైల్ నజీర్(w), హసన్ నవాజ్, అబ్దుల్ సమద్(c), ఫర్హాన్ యూసఫ్, సాద్ మసూద్, మహ్మద్ ఇమ్రాన్ రంధావా, అహ్మద్ డానియాల్, సుఫ్యాన్ మొకిమ్, అలీ రజా

ఇదీ చదవండి: IND VS PAK: పాకిస్తాన్‌ బ్యాటింగ్‌.. తుది జట్లు ఇవే..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement