Photo Credit: Twitter
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో నేపాల్-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు 306 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రలు సెంచరీలతో చెలరేగగా.. ఆ తర్వాత బౌలింగ్‌లో ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రానాలు చెలరేగడంతో భారత్ లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ తిలక్ వర్మ మాట్లాడాడు. ‘ఈరోజు మేము చాలా బాగా ఆడాము. నా బ్యాటింగ్ పట్ల చాలా సంతోషంగా ఉన్నా. వికెట్ కొంచెం సవాలుగా ఉంది. ఈ పిచ్‌పై పరుగులు చేయడం అంత సులభమైతే కాదు. కానీ నేను, కుమార్ కలిసి ప్రదర్శించిన ఆటతీరు పట్ల చాలా గర్వంగా ఉంది.
బౌన్స్ అవుతున్న పిచ్‌పై కొత్తగా వచ్చే బ్యాటర్‌కు బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని నేను, కుమార్ మాట్లాడుకున్నాము. అందుకే చివరిదాకా నిలబడి ఇన్నింగ్స్‌ను కొనసాగించాలనుకున్నాం. 280 పరుగుల స్కోరు ఈ పిచ్‌పై మంచి స్కోరు అవుతుందని అనుకున్నాము. అయితే ఇన్నింగ్స్ చివర్లో సూర్యాన్ష్ షెడ్గే ఆడిన ఇన్నింగ్స్‌తో మేము 300 పరుగుల మార్క్‌ను దాటాము.
ఇక మా బౌలర్ల అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకొని వచ్చిన హర్షిత్ రానా, ప్రిన్స్ యాదవ్‌లు రాణించడం మాకు కలిసొచ్చింది. పాకిస్తాన్-ఏతో మ్యాచ్‌కు ముందు ఈ మ్యాచ్ మాకు చాలా ఉపయోగపడింది. ఇది ఒక గేమ్‌లా మాత్రమే చూస్తున్నాము.’ అని చెప్పుకొచ్చాడు.
India A's largest victory (by runs) in List A cricket ✅ An exceptional performance from India A to register a mammoth 3️⃣0️⃣6️⃣-run victory over Nepal to kickstart their #RisingStarsAsiaCup campaign 🥳🥳 Scorecard ▶️ https://t.co/r7KnQLPzIm #TeamIndia | #INDAvNEP https://t.co/RMzAlrrHDG
— BCCI (@BCCI) November 20, 2026
ఇదీ చదవండి: 26 రన్స్‌కే నేపాల్ ఆలౌట్.. భారత్ ఖాతాలో అతిపెద్ద విజయం


