Photo Credit: BCCI Twitter
ఏసీసీ మెన్స్ ఆసియా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో నేపాల్-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ కెప్టెన్ తిలక్ వర్మ శతకంతో చెలరేగాడు. 107 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న తిలక్ వర్మ ఖాతాలో ఆరు ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అంతకముందు వికెట్ కీపర్ కుమార్ కుషాగ్ర సైతం (102 బంతుల్లో 117) సెంచరీతో చెలరేగడం విశేషం.
77 బంతుల్లో అర్థశతకం సాధించిన తిలక్ మరో 50 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 34 బంతులే అవసరమయ్యాయి. మరోవైపు 62 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన కుమార్ కుషాగ్ర మరుసటి 50 పరుగులను మాత్రం కేవలం 31 బంతుల్లోనే అందుకోవడం విశేషం. ఈ ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 206 పరుగులు జోడించిన అనంతరం కుమార్ కుషాగ్ర 117 పరుగుల వద్ద లలిత్ రాజ్‌బన్సీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
దీంతో భారత్ 248 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన తిలక్ వర్మ శతకం మార్క్ అందుకున్నాడు. అయితే స్కోరును పెంచే క్రమంలో తిలక్ వర్మ (107) ఔటవ్వడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. లిస్ట్-ఏ క్రికెట్‌లో తిలక్ వర్మకు ఇది ఏడో శతకం కాగా.. కుమార్ కుషాగ్ర మూడో సెంచరీ సాధించాడు. తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రలు ఔటైన తర్వాత భారత్ స్కోరు కాస్త మందగించింది.
📸📸 Captain coming up clutch 💯 1️⃣0️⃣7️⃣ runs of pure intent from India A skipper Tilak Varma 👍👍 Updates ▶️ https://t.co/r7KnQLPzIm #TeamIndia | #INDAvNEP | #RisingStarsAsiaCup https://t.co/8rOwYdEKdD
— BCCI (@BCCI) November 20, 2026
📸 What an innings, what a moment 👏 A knock of immense character from Kumar Kushagra 💯 Updates ▶️ https://t.co/r7KnQLPzIm #TeamIndia | #INDAvNEP | #RisingStarsAsiaCup https://t.co/QiKeJN4Vio
— BCCI (@BCCI) November 20, 2026


