భారత్‌ బ్యాటింగ్‌.. తుదిజట్టులో వైభవ్‌ సూర్యవంశీ | Mens Asia Cup Rising Stars 2026 IND A Vs NEP News Updates, Nepal Win Toss And Opt To Bowl First, Check Full Playing XIs For Both Teams | Sakshi
Sakshi News home page

Asia Cup Rising Stars: టాస్‌ ఓడిన భారత జట్టు.. తొలుత బ్యాటింగ్‌

Nov 20 2026 3:24 PM | Updated on Nov 20 2026 4:27 PM

Mens Asia Cup Rising Stars 2026 IND vs NEP: Nepal Won Toss Playing XIs

తిలక్‌ వర్మ- సందీప్‌ లమిచానే (PC: BCCI X)

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌-2026 వన్డే టోర్నమెంట్లో తొలి మ్యాచ్‌కు భారత్‌- ‘ఎ’ జట్టు సిద్ధమైంది. గ్రూప్‌-‘బి’లో భాగంగా నేపాల్‌ జట్టుతో తిలక్‌ వర్మ సేన అమీతుమీ తేల్చుకోనుండగా.. ఇందుకు దోహాలోని వెస్ట్‌ ఎండ్‌ పార్క్‌ అంతర్జాతీయ స్టేడియం వేదిక.

కాగా శుక్రవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నేపాల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఇక ఇటీవల న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా గడిపిన స్టార్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఈ టోర్నీతో వన్డేల్లోనూ తానేంటో నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.

తుదిజట్టులో వైభవ్‌
మరోవైపు.. టీమిండియా టీ20 సంచలనం వైభవ్‌ సూర్యవంశీ కూడా యాభై ఓవర్ల ఫార్మాట్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ టోర్నీలో ఈ ఇద్దరు భారత టీ20 స్టార్ల ప్రదర్శన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ టోర్నీలో తిలక్‌ వర్మ భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. అతడికి డిప్యూటీగా రింకూ సింగ్‌ ఎంపికయ్యాడు.

భారత్‌- ‘ఎ’ వర్సెస్‌ నేపాల్‌ తుదిజట్లు ఇవే
భారత్‌- ‘ఎ’
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ (కెప్టెన్‌), రింకూ సింగ్ (వైస్‌ కెప్టెన్‌), ఆయుశ్‌ బదోని, సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా, అర్షద్ ఖాన్.

నేపాల్‌
అర్జున్ కుమాల్, కుశాల్ భూర్టేల్‌, లోకేశ్‌ బామ్, దేవ్ ఖనాల్, సందీప్ జోరా, బసీర్ అహ్మద్, పవన్ సర్రాఫ్, దీపక్ దుమ్రే (వికెట్‌ కీపర్‌), సందీప్ లామిచానే (కెప్టెన్‌), నందన్ యాదవ్, లలిత్ రాజ్‌బన్షి.

ఇదీ చదవండి: రాణించిన పృథ్వీ షా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ మెరుపులు.. ఆఖరి బంతికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement