source: X
భారత బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి తన దేశవాలీ కెప్టెన్సీ అరంగేట్రంలో చేదు అనుభవం ఎదురైంది. యావత్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన మ్యాచ్‌లోనే వైభవ్‌ను ఓటమి పలకరించింది.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2026లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ జరిగిన మ్యాచ్ కెప్టెన్‌గా వైభవ్‌కు తొలి అసైన్‌మెంట్. ఈ మ్యాచ్‌లో అతడి నాయకత్వంలో బిహార్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వ్యక్తిగతంగానూ వైభవ్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు.
వైభవ్ సహా జట్టు మొత్తం విఫలం కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బిహార్ బౌలర్లు చేతులెత్తేశారు. సూరజ్ కశ్యప్ (4-0-39-3) ఒక్కడూ కాస్త పర్వాలేదనిపించినా, బ్యాటర్లు తలో చేయి వేయడంతో సౌరాష్ట్ర 16.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుచిర్ అహిర్ (21), సిద్దాంత్ రాణా (21) అజేయ ఇన్నింగ్స్‌లతో సౌరాష్ట్రను విజయతీరాలకు చేర్చారు.
ప్రపంచ రికార్డు
వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల 232 రోజుల వయసులో బిహార్ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. దీంతో గతంలో క్రొయేషియా ఆటగాడు జాక్ వుకుసిక్ పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. వుకుసిక్ గతేడాది 17 ఏళ్ల 311 రోజుల వయసులో క్రొయేషియా జట్టుకు నాయకత్వం వహించి ఈ రికార్డు సృష్టించాడు.
ఇదీ చదవండి: కెప్టెన్సీ డెబ్యూలో వైభవ్ విఫలం


