7th ఫెయిలైన వాళ్లు ..పీహెచ్‌డీ చేశారంటే ఎలా? | Clip of Samrat Choudhary remarks goes viral | Sakshi
Sakshi News home page

7th ఫెయిలైన వాళ్లు ..పీహెచ్‌డీ చేశారంటే ఎలా?

Nov 14 2026 4:30 AM | Updated on Nov 14 2026 4:30 AM

Clip of Samrat Choudhary remarks goes viral

పాట్నా: బిహార్ రాజకీయాల్లో ఎప్పుడూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకునే రాజకీయ ప్రత్యర్థులు ప్రశాంత్ కిశోర్, ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిలు భేటీ అయ్యారు. అయితే, ఈ భేటీపై వస్తున్న ఊహాగానాలకు జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ తనదైన శైలిలో ఫుల్‌స్టాప్ పెట్టారు.

తాము కలవడం కేవలం సామాజిక, రాజకీయ మాత్రమేనని, అంతమాత్రాన తన రాజకీయ వ్యతిరేకత ఏమాత్రం మారదని ఆయన స్పష్టం చేశారు.  

పాట్నాలోని బీజేపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కె. సిన్హా నివాసంలో జరిగిన శ్రాద్ధ కర్మ   కార్యక్రమానికి ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, జన సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఇద్దరూ ఎదురుపడగా.. ఎలాంటి కంగారు  లేకుండా, చిరునవ్వుతో పరస్పరం పలకరించుకుని షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిహార్ రాజకీయ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది.

మా మధ్య వైరం అలాగే ఉంటుంది ఈ భేటీపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ప్రశాంత్ కిశోర్ చాలా స్పష్టంగా స్పందించారు. అదొక సామాజిక,  రాజకీయ మర్యాదపూర్వక భేటీ మాత్రమేఅని తేల్చిచెప్పారు.

ఇలా కలవడం వల్ల ఎవరైనా మారిపోతారా? బిహార్ సీఎం సమ్రాట్ చౌదరిని నేను కలిసినంత మాత్రాన ఆయన 7వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి నుంచి అకస్మాత్తుగా పీహెచ్‌డీ హోల్డర్ అయిపోరని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు.

అంతేకాకుండా, నేను గతంలో ఆయనపై క్రిమినల్ ఆరోపణలు చేశాను, ఆయనను విమర్శించాను.. అలా అని నిన్న కలిసి కరಚాలనం చేసినంత మాత్రాన ఆయనను సాధువు అనలేను. మా మధ్య రాజకీయ పోరాటం ఎప్పుడూ ఉండేదే అని ఆయన స్పష్టం చేశారు.   బిహార్ సంస్కృతి ప్రకారం నడుచుకున్నాంరాజకీయంగా తాము ఎంత వ్యతిరేకులైనా, బిహార్ సాంప్రదాయం ప్రకారం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు సామాజిక మర్యాద పాటించాల్సి ఉంటుందని పీకే పేర్కొన్నారు.

తమ పోరాటం ఏ ఒక్క వ్యక్తికో, కులాానికో వ్యతిరేకం కాదని, కేవలం బిహార్ సమగ్ర అభివృద్ధి, మెరుగైన భవిష్యత్తు కోసమేనని ఆయన పునరుద్ఘాటించారు.

గతంలో ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి విద్యార్హతలు,గత నేపథ్యంపై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రశాంత్ కిశోర్, తాజా భేటీ తర్వాత కూడా తన విమర్శల దాడి కొనసాగుతుందని చెప్పకనే చెప్పారు. ఏదేమైనప్పటికీ, రాజకీయ శత్రువులు ఒకే వేదికపై పలకరించుకోవడం బిహార్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement