మితిమీరిన వేగం : కార్‌ షోరూం యజమాని దుర్మరణం | Car Showroom Owner Dies As Fortuner Rams Railing Falls Into River In Bihar | Sakshi
Sakshi News home page

మితిమీరిన వేగం : కార్‌ షోరూం యజమాని దుర్మరణం

Oct 30 2026 3:52 PM | Updated on Oct 30 2026 4:28 PM

Car Showroom Owner Dies As Fortuner Rams Railing Falls Into River In Bihar

బిహార్‌లోని పూర్ణియాలో గురువారం  సాయంత్రం  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఫార్చ్యూనర్ కారు నదిలో పడిపోవడంతో Renault కార్ షోరూమ్ యజమాని, కొచైలీ నివాసి బబ్లూ బిస్వాస్‌ దుర్మరణం పాలయ్యారు. మృతుడు పూర్ణియా మాజీ ఎంపీ సంతోష్ కుష్వాహాకు సమీప బంధువు అని తెలుస్తోంది.  బబ్లూ అకాల మరణ వార్త కుటుంబ సభ్యులలో తీవ్ర కలకలం రేపగా, రాజకీయ, సామాజిక వర్గాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అతివేగంగా  దూసుకొచ్చిన  ఫార్చ్యూనర్ కారు 'క్యాప్టెన్ బ్రిడ్జ్' వద్ద అదుపు తప్పి, రెయిలింగ్‌ను ఢీకొట్టి సౌరా నదిలో పడిపోయింది. స్థానికుల సాయంతో  క్రేన్ ద్వారా కారును నదిలోనుంచి  పైకి తీశారు పోలీసులు. నది నుంచి వాహనాన్ని వెలికితీసిన అనంతరం బబ్లూ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పూర్ణియా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు వీడియో  సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ప్రమాద తీవ్రత కారణంగా కారు ముందు భాగం, పైకప్పు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

కారు అదుపుతప్పి, పెద్ద శబ్దంతో వంతెన భద్రతా రెయిలింగ్‌ను బద్దలుకొట్టి నేరుగా నదిలోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇది చూసి వంతెనపై నుంచి వెళ్తున్న బాటసారులలో భయాందోళనలు నెలకొనగా, ప్రజలు వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే, సదర్ డీఎస్పీ అభినవ్ పరాశర్ , పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో,ఎంతో శ్రమించి కారును బయటకు తీశారు. కానీ  అప్పటికే చాలా ఆలస్యం కావడంతో  కారులో చిక్కుకున్న బబ్లూ విశ్వాస్‌ ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: షేక్ హసీనా వీడియో : ఆ అధికారి అనుమానాస్పద మృతి కలకలం

గంటపాటు నిలిచిపోయిన  ట్రాఫిక్
ఈ ఘటనతో కప్తాన్ వంతెనపై వేలాదిమందితో కూడిన భారీ జనసమూహం గుమిగూడారు. ఈ గందరగోళంతో దాదాపు గంటసేపు ట్రాఫిక్‌కు పూర్తిగా అంతరాయం కలిగింది. ఎట్టకేలకు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. 

ఇదీ చదవండి: రెండేళ్లలో 40 విల్లాలు, కాటేజీలు : ఐఏఎస్‌పై సంచలన ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement