న్యూఢిల్లీ: స్పెయిన్‌లోని మాడ్రిడ్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో స్పెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ప్రమాద సమయంలో అందులో ప్రయాణిస్తున్న భారతీయులు, వారి కుటుంబ సభ్యులు సహాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు స్పెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు, ఇమెయిల్ వివరాలను వెల్లడించింది.
టోలెడో ప్రావిన్స్‌లోని ఉర్దా సమీపంలో 2026 అక్టోబర్ 28న ప్రమాదానికి గురైన రైళ్లలో భారతీయులు ఎవరైనా ప్రయాణించి ఉంటే, లేదా వారి బంధువులకు సమాచారం అవసరమైతే వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
ఘోర రైలు ప్రమాదం
కాగా నిన్న బుధవారం స్పెయిన్‌లో రెండు రైళ్లకు సంబంధించిన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక హైస్పీడ్ రైలు మరో రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం 68 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదం జరిగిన రైళ్లలో ప్రయాణించిన భారతీయులకు అవసరమైన సహాయం అందించేందుకు మాడ్రిడ్‌లోని భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వెల్లడించింది.
అత్యవసర సంప్రదింపు వివరాలు:
భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్: +34 650 339 008
ఇమెయిల్: cons.madrid@mea.gov.in
రెన్ఫే (Renfe) రైల్వే సంస్థ: 900 10 10 20
ఇరియో (Iryo) రైల్వే సంస్థ: 900 001 403
ప్రమాద బాధితులకు సహాయం అందించేందుకు అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలంలో పనిచేస్తున్నారని స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తెలిపారు. బాధితుల భద్రతను నిర్ధారించడంతోపాటు, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులందరితో సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, బాధితులందరికీ తన ప్రగాఢ సానుభూతి, సంఘీభావం, మద్దతు తెలియజేస్తున్నట్లు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
ఇదీ చదవండి: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం


